YS Jagan Mohan Reddy And MLA Roja Makes Controversial Comments On TDP, AP CM Chandrababu Naidu | AP Assembly

Ys jagan mohan reddy mla roja controversial comments tdp chandrababu naidu ap assembly

ys jagan mohan reddy, ys jagan in assembly, ys jagan controversy, ysr congress party, mla roja controversy, roja in assembly, roja comments on chandrababu, chandrababu naidu news, chandrababu updates, ap capital city, amaravathi master plan

YS Jagan Mohan Reddy MLA Roja Controversial Comments TDP Chandrababu Naidu AP Assembly : YS Jagan Mohan Reddy And MLA Roja Makes Controversial Comments On TDP, AP CM Chandrababu Naidu For Another Time.

జగన్ జగడాలు.. రోజా రుసరుసలు..

Posted: 09/03/2015 11:35 AM IST
Ys jagan mohan reddy mla roja controversial comments tdp chandrababu naidu ap assembly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనజభ... ఒకప్పుడు రాజకీయ పార్టీల మధ్య శాంతియుతంగా జరిగే సమావేశాల వేదికగా వుండేది. కానీ ఇప్పుడు వివాదాలకు అడ్డంగా మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే అలాగే అర్థం చేసుకోవాల్సి వుంటుంది మరి! అధికార టీడీపీ పార్టీ, వైకాపాల మధ్య విమర్శనాస్త్రాలు తారాస్థాయికి చేరిపోయాయి. నిన్నటివరకు పార్టీలపరంగా విమర్శలు చేసుకున్న వీరిమధ్య వైరుధ్యం వ్యక్తిగత జీవితాలపై తిట్లపురాణం వరకు వచ్చేసింది. ముఖ్యంగా.. బాబు, జగన్, రోజా, అచ్చెన్నాయుడు తదితరలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఇప్పుడు తాజాగా జగన్ మరోసారి నిప్పులు చెరిగారు.

వైకాపా పార్టీని సైకో పార్టీగా మార్చుకోవాలని, ఆ పార్టీలో వున్నవారంతా సైకోలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపాను సైకో పార్టీ అని అనడాన్ని తప్పుబట్టిన ఆయన... తెలుగుదేశం సభ్యులంతా రౌడీలని, వాళ్లది రౌడీ పార్టీ అని ఆరోపించారు. ‘పెద్ద పెద్ద కళ్లేసుకుని చంద్రబాబు ఇలా చూస్తున్నారు. వేలెత్తి చూపి భయపెట్టాలని అనుకుంటున్నారు. మేం భయపడం’ అని అన్నారు. తమపై ఆరోపణలు చేస్తే సహిస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమపై టీడీపీ పార్టీ ఎన్నో ఆరోపణలు చేస్తోందని, వాటిని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని, నిరూపింకపోతే బాబు రాజీనామా చేయడానికి సిద్ధమా? చాలెంజ్ చేస్తారా? అంటూ సవాల్ మరోసారి విసిరారు. తనదైన శైలిలో టీడీపీ పార్టీపై సెటైర్లు, విమర్శలు గుప్పించారు.

అలాగే.. రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న ‘చంద్రన్న యాత్ర’పై వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి ‘చంద్రన్న యాత్ర’ అనే పేరు సరిపోలేదని... ‘చంద్రన్న కరవు యాత్ర’ అని పెట్టుకుంటే సూపర్ గా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏపీలోని అన్ని జిల్లాలో ఈ యాత్రను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రోజా ఈ విమర్శలు చేశారు. రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని ఆమె అన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటడంతో, ప్రజలు అల్లాడిపోతున్నారని... అయినా, ఇవేమీ పట్టని చంద్రబాబు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే పనికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles