Injection Psycho Attack On Biker Who Gave Lift To Him | Injection Psycho Mysterious Story | SP Bhaskar Bhushan

Injection pshycho mysterious story sp bhaskar bhushan

Injection Pshycho, Injection Pshycho mysterious story, Injection Pshycho controversies, Injection Pshycho attack biker, sp bhaskar bhushan, bhaskar bhushan about Injection Pshycho, Injection Pshycho attack women

Injection Pshycho Mysterious Story SP Bhaskar Bhushan : Injection Psycho Attack On Biker Who Gave Lift To Him. But SP Bhaskar Bhushan Says The Cases Which Are Filed After 26 Are Fake. According To His Statement Doubts Going Viral That Is Psycho Arrested Or Not.

లిఫ్ట్ ఇచ్చిన పాపానికి సూది గుచ్చాడు.. కానీ!

Posted: 08/31/2015 04:38 PM IST
Injection pshycho mysterious story sp bhaskar bhushan

‘ఇంజక్షన్ సైకో’.. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు చేస్తున్నాడో తెలియదు కానీ.. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిఒక్కరిని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తొలుత మహిళల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ సూదులు గుచ్చిన ఈ సైకో.. ఇప్పుడు పురుషుల్ని సైతం బెంబేలెత్తిస్తున్నాడు. మొన్ననే ఓ వ్యక్తిపై సిరంజీతో దాడి చేసి వార్తల్లో నిలిచిన ఈ సైకో.. తాజాగా మరో వ్యక్తిపై దాడి చేసి పరారయ్యాడు. భీమవరం మండలం కొవ్వాడలో సోమవారం రోజు ఓ వ్యక్తి బైక్ పై వెళుతుండగా.. సైకో లిఫ్ట్ కావాల్సిందిగా అడిగాడు. దీంతో సదరు వ్యక్తి అతనికి లిఫ్ట్ ఇవ్వగా.. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ సైకో సూది గుచ్చి పరారయ్యాడు. మంచికి పోతే చెడు ఎదురైనట్లు.. లిప్ట్ ఇచ్చిన పాపానికి ఆ వ్యక్తి ఇంజక్షన్ పాలైయ్యాడు.

ఇదిలావుండగా.. ఈనెల 26వ తేదీ తర్వాత జరిగిన ఇంజక్షన్ దాడులన్నీ అబద్ధపు కేసులని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపడం కలకలం రేపింది. ఆ తేదీ తర్వాత పొడిచిన ఇంజెక్షన్లలో ఎలాంటి మత్తుపదార్థం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గ్రామాల్లో తాము రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకుంటామని, ఇప్పటివరకు సూది సైకో దాడులకు సంబంధించి 11 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ప్రజలు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే.. ఆ ‘సూది సైకో’ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 26 తర్వాతి కేసులన్నీ అబద్ధాలేనని ఎస్పీ అంటున్నారంటే, ఆరోజే సూది సైకో పోలీసుల అదుపులోకి వెళ్లినట్లు అర్థం చేసుకోవాలి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించడం లేదు.

రాజమండ్రిలో ట్రావెల్స్లో పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి సైకో అని, అతడిని పట్టుకున్నారని కొందరు పోలీసులు అన్నారు. మరికొందరు.. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో సైకోను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలా.. భిన్న కథనాలు వస్తున్నాయే తప్ప, అసలు సూది సైకో పోలీసులకు పట్టుబడ్డాడా లేదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కావడంలేదు. ఒకవేళ అతనిని అదుపులోకి తీసుకుని వుంటే.. ఇప్పటికీ సూది దాడులు ఎందుకు జరుగుతున్నాయి..? ఎవరు చేస్తున్నారు..? అనే విషయం అంతుచిక్కడం లేదు. ఏదేమైనా.. పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న ‘సూది సైకో’ దొరికాడా.. లేదా అనేది పెద్ద మిస్టరీగా మారింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Injection Pshycho  SP Bhaskar Bhushan  

Other Articles