Sheena Bora | Indrani Mukerjea | Sheena Murder

Was sheena bora pregnant when she was killed

Sheena Bora, Indrani Mukerjea, Sheena Murder, Indrani Mukarjea Daughter, Rahul, Honour Murder

Was Sheena Bora Pregnant When She Was Killed? Even as the sordid and unsavoury details of Indrani Mukerjea’s dark and murky personal and professional life continue to emerge, we are learning that the most proximate motive for her to murder her daughter Sheena Bora may have been a desperate need to safeguard her finances and prevent a certain element of personal life from going public.

హత్యకు గురయ్యే సమయంలో షీనా గర్భవతా..?

Posted: 08/28/2015 08:13 AM IST
Was sheena bora pregnant when she was killed

ముంబైలో జరిగిన షీనా బోరా హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నది. భారత కార్పొరేట్ రంగంలో హై ప్రొఫైల్ మర్డర్‌గా నిలిచిన ఈ కేసు గడియకోమలుపు తిరుగుతున్నది. షీనా హత్య జరిగినప్పుడు ఆమె గర్భవతి అని ముఖర్జియాలకు అత్యంత సన్నిహితులైన స్నేహితులు వెల్లడించారు. కుటుంబంలో ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధాల రహస్యాలను రాబట్టేందుకు పీటర్ ముఖర్జియా కుమారుడు, షీనాబోరా స్నేహితుడైన రాహుల్‌ను పోలీసులు విచారించారు. షీనాతో ఏడాదికి పైగా బంధంలో ఉన్న రాహుల్ ఆమె అదృశ్యమవడంపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు ప్రశ్నించారు.

ఇంద్రాణికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి కారణంగానే షీనా గర్భం దాల్చినట్టు వారి కుటుంబ సన్నిహితులు చెప్తున్నారు. ముఖర్జియాల ఎలక్ట్రానిక్ మీడియా వ్యాపారం ముగిసిన తరువాత ఆ వ్యక్తి షీనాతో కలిసి రహస్యంగా థాయ్‌లాండ్ సందర్శించినట్టు పేర్కొన్నారు. ఇంద్రాణికి షీనా చెల్లెలు అన్న భావనతోనే ఆ వ్యక్తి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు. ఈ విషయమై ఇంద్రాణి ఆ వ్యక్తిని నిలదీసినప్పుడు, తాను షీనాతో సన్నిహితంగా ఉన్న సంగతిని అంగీకరించాడని, అందులో తప్పేముంది? అని కూడా వ్యాఖ్యానించాడని సమాచారం. పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా ప్రేమలో ఉందన్న సంగతి తెలిసి, ఆ వ్యక్తి వైదొలిగాడని కుటుంబ సన్నిహితులు తెలిపారు. ఈ సమయంలోనే ఇంద్రాణి తన భర్త పీటర్‌తో షీనా తన చెల్లెలు కాదు కూతురు అని వెల్లడించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఒక సమయంలో ఇంద్రాణి వద్దకు వచ్చిన షీనా.. నీతో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి వల్లే నేను గర్భవతిని అయ్యాను అని చెప్పినట్లు తెలుస్తున్నది.

అంతేకాకుండా తాను ఆ బిడ్డకు జన్మనిస్తానని, తన పేరిట విదేశీ బ్యాంకులో భారీ ఎత్తున డిపాజిట్ చేసిన డబ్బును కూడా సొంతం చేసుకుంటానని చెప్పిందని సమాచారం. ఆ డబ్బు సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ ముఖర్జియాలకు చెందిన ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థలో పెట్టిన పెట్టుబడి అని తెలుస్తున్నది. అలాగే భారత్‌కు చెందిన మరో సంస్థకూడా రూ.600 కోట్ల వరకు ఐఎన్‌ఎక్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. ఐఎన్‌ఎక్స్ మూతపడటంతో ఆ సంస్థ కూడా తన డబ్బును వెనక్కు తీసుకోవడానికి అంతగా ప్రయత్నించలేదని తెలిసింది. ఈ డబ్బును దక్కించుకునేందుకే ఇంద్రాణి కూతురును హత్య చేసిందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sheena Bora  Indrani Mukerjea  Sheena Murder  Indrani Mukarjea Daughter  Rahul  Honour Murder  

Other Articles