Onion | Online | Retail | grocery

Want to buy onions cheap then go online

Onion, Online, Retail, online grocery, GrocerMax, Localbanya, MeraGrocer, Freshfalsabzi.com

Want to buy onions cheap then Go online. online grocery stores are looking to gain favour with customers by offering onions at about half the rate that neighbourhood stores are charging. Companies such as Localbanya, MeraGrocer, Freshfalsabzi.com and GrocerMax are offering onions at Rs 40-69 per kilogramme against Rs 80 and more in the shops. They're able to do this through better logistics and by cutting out middlemen.

తక్కువ ధరకు ఉల్లి.. ఎక్కడో తెలుసా..?

Posted: 08/26/2015 03:55 PM IST
Want to buy onions cheap then go online

ఉల్లి చేస్తున్న లొల్లి అంతా ఇంతా కాదు.. ఢిల్లీ దగ్గరి నుండి గల్లీ వరకు అంతటా ఉల్లి మంటలు రేపుతోంది. ప్రభుత్వాల మీద మంటలు రేపడమే కాకుండా సామాన్యుడి చేత కంటతడి పెట్టిస్తోంది. బంగారం కన్నా ఉల్లిపాయలను గిఫ్ట్ గా ఇవ్వండి అన్నంతలా దేశంలో ఉల్లి ధరలు మండుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలకు దిగుతున్నా కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. నిత్యావసర వస్తువుల జాబితాలో ముందుండే ఉల్లి అందరికి చేదుగా తయారైంది. ఉల్లి కావాలంటే మార్కెట్ లో జేబులో డబ్బులు ఖాళీ చేయాల్సిందే. ఉల్లి ధర ఏకంగా సెంచరీకి దగ్గరగా ఉండటం అందరికి కంట నీరు తెప్పిస్తోంది. అయితే ఇలాంటి సమయాల్లో ఉల్లిని చాలా తక్కువ ధరకు అందిస్తే ఎలా ఉంటుంది...? అలా ఇస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. మరి అలాంటి బంపర్ ఆపర్ గురించి మేం మీకు చెప్పబోతున్నాము. జాగ్రత్తగా ఉల్లిని కొని... పండగ చేసుకోండి.


ఇండియాలో ఆన్ లైన్ వ్యాపారం బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే నిమిషానికి పదహారు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది అంటే ఈ కామర్స్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఉప్పు దగ్గరి నుండి అన్ని వస్తువులు ఆన్ లైన్ లో అందుబాటులో వస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయలు కూడా ఆన్ లైన్ అది కూడా చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నారు ఆన్ లైన్ వ్యాపారులు.. బయట దాదాపు వంద రూపాయలు ఉన్న ఉల్లిని కేవలం అరవై రూపాయలకు అందిస్తున్నాయి ఆన్ లైన్ గ్రోసరీస్. ఇంకే ముంది తమ సైట్ లు తమ వ్యాపారాన్ని తక్కువ టైంలో విస్తరిస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Onion  Online  Retail  online grocery  GrocerMax  Localbanya  MeraGrocer  Freshfalsabzi.com  

Other Articles