జనసేన పార్టీ నేత, తెలుగు సినిమా రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలుస్తున్నారు. ఏపి కొత్త రాజధాని కోసం ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ మీద రాజధాని గ్రామాల్లో పర్యటించడంతో ఏపి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధాని గ్రామాల్లోని రైతులతో ముఖాముఖి నిర్వహించడం ద్వారా వాళ్ల సమస్యలను ప్రత్యక్షంగా విన్న పవన్ కళ్యాణ్ తాను రైతుల కన్నీళ్లతో కాకుండా వారిని ఒప్పించే భూములు తీసుకోవాలని ఆశిస్తున్నానని.. చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తారని ఆవిస్తున్నానంటూ పవన్ వ్యాఖ్యానించారు. ముందు నుండి అందరి తరఫున తాను ప్రశ్నిస్తానని.. మిత్రపక్షం అయినంత మాత్రాన బానిసలా ఉండబోను అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే పవన్ వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడ అండ్ కో చాలా సీరియస్ గా తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రతి మాట నిజం.. రాజధాని గురించి పూర్తి అవగాహనతో ఆచితూచి మాట్లాడారు. అయితే పవన్ చేసిన ప్రతి మాట మీద ఏపిలో చర్చసాగింది. అయితే ఢిల్లీలో పవన్ మాటల మీద ఫైర్ మొదలైంది. పవన్ మాట్లాడిన ప్రతి మాట మీద చంద్రబాబు అండ్ టీం సీరియస్ గా తీసుకుంది. ప్రతిపక్షాల కన్నా కూడా పవన్ లాంటి మిత్రున్ని దూరం చేసుకునే పరిస్థితిలో టిడిపి, చంద్రబాబు నాయుడు సిద్దంగా లేదు. అందుకే ఢిల్లీలో పవన్ మాట్లాడిన మాటల మీద చర్చసాగింది. ఏపికి ప్రత్యేక హోదా మీద, ఏపికి ఉన్న అన్ని ఇబ్బందుల మీద ఢిల్లీలో చర్చసాగింది. పవన్ కళ్యాణ్ పర్యటించిన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు నాయుడు దీని మీద చాలా సీరియస్ గా స్పందించారు. నిజాలు మాట్లాడే పవన్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తమ మంత్రులకు హుకుం జారీ చేశారు. రైతుల మీద తాను మాట్లాడితే.. కేవలం మూడు వేల ఎకరాలే అని మాట్లాడతారా అంటూ పవన్ ఫైర్ కావడం మీద కూడా ఢిల్లీలో చర్చసాగినట్లు సమాచారం. మొత్తానికి రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రభావం ఢిల్లీలో కనిపించడం నిజంగా విశేషం.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more