accused threatens victim to withdraw police complaint or will rape again

Accused threatens to rape again if victim does not withdraw police complaint

rape accused, threatens, victim, police complaint, will rape again, Muzaffarnagar, crime against women, harrasement against women, violence against women, rape, gang rape, Uttarpradesh

An accused in rape case and neighbour of the victim threatens her to withdraw police complaint, or else will rape u again

మళ్లీ అదే రిపీట్ అవ్వుద్ది.. అత్యాచార బాధితురాలికి నిందితుడి వార్నింగ్

Posted: 08/25/2015 08:56 PM IST
Accused threatens to rape again if victim does not withdraw police complaint

మళ్లీ అదే రిపీట్ అవ్వుద్ది అంటూ అత్యాచార బాధితురాలికి నిందితుడి వార్నింగ్..ఇవ్వడం కలకలం రేపుతోంది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నేరాలకు, అత్యాచారాలకు పాల్పడిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతూ.. పైపెచ్చు కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారన్న అరోపణలకు ఊతమిస్తున్నాయి. ఇటీవల దేశ సర్వన్నత న్యాయస్థానం అత్యాచార కేసుల్లో బాధితురాళ్లు కేసు ఉపసంహరించుకున్నా.. విచారణ సాగాల్సిందేనని తీర్పను వెలువరించినా.. ఇంకా ఈ తరహా నేరాలకు పాల్పడిన వారిలో మాత్రం మార్పు రావడం లేదు. అందుకు ఈ ఘటనే ఉదాహరణ

ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా కుర్వావాలో గ్రామంలోని అంకుర్ అనే యువకుడు ఈ నెల 21న తమ పోరుగున వుంటే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దిక్కుతోచని బాధితురాలు తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగుడు మళ్లీ వచ్చాడు. పోలీసులకు ఇచ్చిన పిర్యాదును తక్షణం వెనక్కు తీసుకోని పక్షంలో మళ్లీ అదే (రేప్) రిపీట్ అవుద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు సోమవారం మరోసారి పోలీస్ స్టేషన్కు వచ్చి మరోసారి ఆదే నిందితుడిపై ఫిర్యాదుచేసింది. మొన్నరాత్రి బాధితురాలిని ఒంటరిగా దొరకబుచ్చుకున్న అంకుర్.. తనపై పెట్టిన కేసును వెనక్కితీసుకోకుంటే మళ్లీ రేప్ చేస్తానని బెదిరించాడని మరో పిర్యాదును పోలీసులకు అందజేసింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడి గాలింపునకు అదనపు సిబ్బందిని కేటాయించినట్లు పుగానా సీఐ తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఆ కీచకుడ్ని ఎలాగైనాసరే పట్టుకోవాలని గస్తీ పెంచారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape accused  threatens  victim  police complaint  will rape again  Muzaffarnagar  

Other Articles