Suruchi Foods Agency Offering 5600 Kilograms Laddoo To Khairatabad Vinayak Statue | Ganesh Festival

Khairatabad vinayak statue suruchi foods agency offer 5600 kilograms laddoo

ganesh festival, khairatabad ganesh, khairatabad vinayak statue, vinayak festival suruchi foods, khairatabad laddoo, ganesh festival special, khairatabad laddoo, suruchi foods laddoo

Khairatabad Vinayak Statue Suruchi Foods Agency Offer 5600 Kilograms Laddoo : Suruchi Foods Agency Offering 5600 Kilograms Laddoo To Khairatabad Vinayak Statue In Ganes Festival Occassion.

ఈసారి ఖైరతాబాద్ గణేశుడికి భారీ లడ్డూ

Posted: 08/25/2015 10:18 AM IST
Khairatabad vinayak statue suruchi foods agency offer 5600 kilograms laddoo

వినాయకచవితి సందర్భంగా ప్రతిఏటా హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో ప్రసిద్ధ గణనాథుని విగ్రహం ప్రతిష్టిస్తుంటారు. దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా పేరుమోసిన ఈ గణనాథునికి... తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్‌వారు నైవేద్యంగా ఓ భారీ లడ్డూని సమర్పిస్తున్నారు. 2010 నుంచి వరుసగా ప్రతి సంవత్సరం ఇచ్చిన వారు.. ఈసారి మరి పెద్దదిగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 5,600 కేజీల భారీ లడ్డూ సురుచి ఫుడ్స్ లో తయారు కానుందని సమాచారం.

ఈ సందర్భంగా సురుచి ఫుడ్స్ సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు మాట్లాడుతూ.. ‘2010 నుం చి ఖైరతాబాద్ గణనాథునికి ఉచితంగా లడ్డూను అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే.. ఈసారి మునుపటికంటే మరింత పెద్ద లడ్డూను తయారుచేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. లడ్డూ తయారీ నిమిత్తం సెప్టెంబర్ 9న తనతోపాటు 16 మంది సిబ్బంది గణేష్ మాలధారణ చేస్తామని, 12న లడ్డూ తయారీ ప్రారంభించి, 14కి పూర్తి చేస్తామని చెప్పారు. 15న లడ్డూకు తుదిమెరుగులు దిద్దుతామని, ప్రముఖ కళాకారుడు వీరబాబు లడ్డూ పైభాగంలో జీడిపప్పు పౌడర్‌ను ఉపయోగించి చేసిన స్వీట్ పేస్టుతో త్రిశక్తిమయ విద్యాగణపతి రూపాన్ని తీర్చిదిద్దుతారని తెలిపారు.

అలా ఆ విధంగా తయారు చేసిన ఆ భారీ లడ్డూనే 16వ తేదీన ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ పంపుతామన్నారు. లడ్డూ తయారీలో చక్కెర 2,425 కిలోలు, శెనగపప్పు 1,565 కిలోలు, నెయ్యి 1,100 కిలోలు, జీడిపప్పు 380 కిలోలు, బాదంపప్పు 100, యాలకులు 33, పచ్చ కర్పూరం 11 కిలోలు ఉపయోగించనున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా.. నైవేద్యంగా పెట్టే ఈ లడ్డూని వేలంపాట వేస్తారు. గత నాలుగేళ్లలో లక్షల్లో పలికిన ఈ లడ్డూ ధర.. ఈసారి మరింత ఎక్కువ పలుకనున్నట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suruchi foods  khairatabad ganesh  ganesh festival  

Other Articles