London Scientists Found New App Which Reads Human Minds | Mobile Phones | Mobile Applications

London scientists found new app to read mind mobile phones

mobile apps, mobile applications, android mobiles, mobile phones, mind app, mind read application, london scientists

London Scientists Found New App To Read Mind Mobile Phones : London Scientists Found New App Which Reads Human Minds. According to that we can make programmes.

‘ఈరోజు మన పనితీరు ఎలా వుండబోతోంది?’

Posted: 08/25/2015 09:55 AM IST
London scientists found new app to read mind mobile phones

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కంప్యూటర్స్, మొబైల్ వంటివి నేటి ఆధునిక యుగంలో ఎక్కువ వాడుకలో వున్నాయి కాబట్టి.. వాటిని దృష్టిలో పెట్టుకుని నిపుణులు సరికొత్త యాప్ లను కనుగొంటున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో లక్షల యాప్ లు కనిపెట్టిన నిపుణులు.. యూజర్లను ఆకర్షించేందుకు కొత్త తరహా యాప్ లను ప్రవేశపెడుతున్నారు. ఆ యాప్ లు ఏమిటంటే.. మన భవిష్యత్తు ఎలా వుండబోతోంది..? మన ఆయుష్షు ఎంత..? వంటి విషయాలను తేల్చే యాప్ లను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇప్పుడు అదే తరహాలో మరో కొత్త అప్లికేషన్ ను కనుగొన్నారు. ఆ యాప్ వివరాలేంటో తెలుసుకుందామా..!

ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ‘ఈ రోజు  మన పనితీరు ఏ విధంగా ఉండబోతుంది..?’ అని ఎవరైనా అడిగితే.. చెప్పడం కష్టమే. చెప్పడమేంటి..? అసలు ఆ ఊహా తోచదు. అయితే.. లండన్ పరిశోధకులు మాత్రం ఆ విషయాన్ని చెప్పగలిగే అధునాతన యాప్‌ను అభివృద్ధి చేశారు. దీనికి చేయాల్సిందల్లా.. యాప్ నుంచి మనకు వచ్చిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే. ‘ఎప్పుడు నిద్రలేచారు.. ఆందోళనగా ఉన్నారా.. ఈ రోజు ఎలా ఫీలవుతున్నారు’.. వంటి ప్రశ్నలు ఉంటాయి. వీటికీ సమాధానాలు ఇస్తే చాలు.. ఆ రోజు మన మెదడు పనితీరు ఎలా ఉండబోతుందో ఒక స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ ఆధారంగా కార్యక్రమాలు మనకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mobile apps  london scientists  mobile phones  

Other Articles