pavan comments in positive manner: Chandrababu Suggests Party cadre

Chandrababu suggests party leaders to take pawan kalyan comments in positive way

chandrababu naidu, pawan kalyan, pawan kalyan tweets, land pooling, ap capital city, amaravathi, amaravathi master plan, chandrababu press meet, pawan kalyan press meet

Chandrababu Suggestions To Party Leaders In Pawan kalyan Issue : Chandrababu Given Suggestions To Party Leaders To Not Make Controversial Comments On Pawan kalyan Tweets

పవన్ వ్యాఖ్యలను వ్యతిరేకించవద్దు.. పాజిటివ్ గా వుండండి : చంద్రబాబు

Posted: 08/22/2015 07:59 PM IST
Chandrababu suggests party leaders to take pawan kalyan comments in positive way

జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్.. భూ సేకరణ విషయమై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న తరుణంలో పార్టీ నేతలు, మంత్రులు ఎవ్వరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా తన అభిప్రాయాలను సామాజిక మాధ్యం ట్విట్టర్ ద్వారా వ్యక్తపరుస్తున్న తరుణంలో.. పవన్ కామెంట్లను స్వాగతిస్తూనే మెలిక పెట్టారు కొందరు మంత్రులు. అది చాలదన్నట్లు మరికోందరు ఏకంగా పవన్ ను టార్గెట్ చేస్తూనే.. భూ సేకరణ జరగకుండా రాజధాని నిర్మాణం ఎలా చేపడతామని ప్రశ్నించారు ఇంకోందరు. రాజధాని నగరంలో ప్రభుత్వం ఇచ్చిన బూములు తీసుకుని స్టూడియోలు గట్రా కట్టేసుకుని.. భూములను సమీకరించవద్దని పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇంకోదరు.

ఇలా ప్రభుత్వం నుంచి ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో పవన్ అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. తమకు బహుళ పంటలు పండే భూములు ఇవ్వలేదని, కొండలు, కోనలు వున్న ప్రాంతాన్ని ఇచ్చారని, ఇక తమకు ఎక్కడా స్టూడియోలు లేవని ఆయన కుండబద్దలు కోట్టినట్లు బదులిచ్చారు. త్వరలోనే తాను రాజధాని ప్రాంత గ్రామాలను పర్యటిస్తానని చెప్పారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతల వెంట వుండి కావాలనే ఈ తరహా వ్యాఖ్యలను చేయించారన్న వార్తులు  తెరపైకి వచ్చాయి. చందరబాబు డైరెక్షన్ లనే అమాత్యులు యాక్షన్ చేశారన్న వార్తలు నేపథ్యంలో ఆలస్యం చేస్తే తమకు నష్టం జరుగుతుందని భావించిన చంద్రబాబు రంగప్రవేశం చేశారు. దిద్దుబాటు చర్యలకు తెరలేపారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడ వద్దని ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు, పార్టీ నేతలకు సూచించారు. పవన్ వ్యాఖ్యలను పాజిటివ్ గా చూడాలని, ఆయన తమ మిత్రపక్ష్ నేతగానే పరిగణించాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కూడా కారణమేనన్న విషయాన్ని మర్చిపోరాదని చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై ప్రతివిమర్శలకు దిగొద్దని ఆయన హితువు పలికారు. కొంతమంది రైతులు పవన్ ను ఆశ్రయించడం వల్లే వారి సంక్షేమం కోసం ఆయన అలా మాట్లాడుతున్నారని, అందులో ఏమాత్రం తప్పు లేదని పేర్కొన్నారు. భూసేకరణపై వాస్తవ పరిస్థితులను పవన్ కు తానే స్వయంగా వివరిస్తానని బాబు చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  pawan kalyan  land pooling  

Other Articles