KCR | Talasani | Telangana | Honest

The one and only person is telangana cm kcr

KCR, Talasani, Telangana, Honest, CM KCR, Talasani Srinivas

The one and only person is Telangana cm KCR. Telangana minister Talasani Srinivas appriciate ck KCR for his honest.

ఒకే ఒక్కడు... ఆ ఒక్కడు కేసీఆర్..!

Posted: 08/21/2015 08:35 AM IST
The one and only person is telangana cm kcr

ఒకే ఒక్కడు, ఒక్కడు అని చెబుతుంటే తెలుగు సినిమా టైటిల్స్ గుర్తుకు వస్తున్నాయేమో కానీ ఓ నేతకు మాత్రం కేసీఆర్ గుర్తుకు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఒకే ఒక్కడు అని తెగ భజన చేస్తున్నారు ఆ తెలంగాణ మంత్రిగారు. ఇంతకీ ఎవరా భజన బృందం సభ్యుడు అనుకుంటున్నారా...? తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇంతకీ కేసీఆర్ ఎందులో ఒకే ఒక్కడు అనేగా మీ డౌట్. దేశంలో అవినీతి మచ్చలేని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాత్రమేనని మంత్రి తలసాని కొనియాడారు. ప్రతిపక్షాలు మంచి విషయాలకు అడ్డుతగులుతున్నాయని, ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు ఏది అవసరం అనుకుంటే అది చేసి తీరుతామని, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగిలితే లోపలేసైనా పూర్తిచేస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ వారికి కమీషన్ తీసుకోవడం అలవాటయ్యిందని, అందుకే ప్రతిదాంట్లో ఏదో జరిగిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో మంత్రి తలసాని గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే విపక్షాలు ఏదో రకంగా ఆందోళనలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏదైనా తప్పు జరిగితే సూటిగా చెప్పాలని సూచించారు. బట్టకాల్చి మీద వేస్తాం అంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా అమలు కావడం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వలేదన్నారు. రైతాంగానికి ప్రతి ఎకరాకు నీరందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. కర్ణాటకలోని గిరిజాపూర్ జలాశయం నిర్మిస్తే మహబూబ్‌నగర్ ప్రజలు ఇబ్బంది పడతారని, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలు వెల్లి జలాశయ నిర్మాణం ఆపొచ్చుకదా అని సూచించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే సోనియాతో మాట్లాడి కృష్ణానదిపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీని ఆపించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Talasani  Telangana  Honest  CM KCR  Talasani Srinivas  

Other Articles