Indian Rules Creating Problems For Indian Boy Suresh And Belgium Girl Sarah Love Marriage | Cruise Ship Love Story | Indian Rules

Indian boy suresh belgium girl sarah cruise ship love story indian rules

indian boy belgium girl love marriage, suresh sarah love story, cruise ship love story, telugu love stories, belgium girl sarah love story, ship love story

Indian Boy Suresh Belgium Girl Sarah Cruise Ship Love Story Indian Rules : Indian Rules Creating Problems For Indian Boy Suresh And Belgium Girl Sarah Love Marriage.

అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి.. మధ్యలో ‘చిక్కు’?

Posted: 08/20/2015 01:01 PM IST
Indian boy suresh belgium girl sarah cruise ship love story indian rules

టైటిల్ చదవగానే ఈ స్టోరీ ఎంత ఆసక్తికరంగా వుంటుందోనన్న విషయాన్ని ఇప్పటికే పసిగట్టి వుంటారు. అవును.. అచ్చం సినిమాలాగే సాగే ఈ ‘ప్రేమ’ కథ చాలా ఇంట్రెస్టింగ్ గానూ, సరికొత్త అనుభూతిని తలపించే విధంగానూ వుంటుంది. కానీ.. ఈ లవ్ స్టోరీలో ఓ చిక్కుముడి కూడా వుంది. ఏ విధంగా అయితే ప్రేమికుల్ని విడదీయడానికి విలన్ సినిమాలో ప్రయత్నిస్తాడో.. అదేవిధంగా ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ వుంది. అయితే.. ఇక్కడ విలన్ ఓ వ్యక్తి కాదు, ప్రభుత్వం. ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని కొనసాగిద్దామని భావిస్తున్న ఈ జంటను ప్రభుత్వం విలన్ గా మారి, విడదీస్తోందని సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని నమక్కల్ దగ్గర్లోని కొళ్లి హిల్స్కు చెందిన గిరిజన యువకుడు సురేష్ కుమార్ (28) షిప్ లో చెఫ్గా పని చేస్తున్నాడు. ఇతగాడు ఓ సందర్భంలో తన కన్నా వయసులో రెండేళ్లు పెద్దదైన బెల్జియం యువతి సారాని మొదటిసారి షిప్లో చూశాడు. అలాగే ఆ అమ్మాయి కూడా సురేష్ వైపు చూసింది. తొలి చూపులు కలిసిన ఆ శుభవేళలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు తెలుసుకుని, తమ ప్రేమను వెల్లడించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే కుటుంబసభ్యులకు తమ ప్రేమ గురించి వివరించి.. వారిని తమ వివాహానికి ఒప్పుకునేలా చేశారు. కొళ్లి హిల్స్ లోని వినాయకుడి ఆలయంలో సోమవారం సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహమైంది కూడా! ఇక తమ జీవితం సాఫీగా సాగుతుందని, తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుదామని వారు అనుకుంటున్న సందర్భంలో మన ప్రభుత్వ నిబంధనలు వారికి ఆటంకంగా మారాయి. సారా విదేశీయురాలు కావడంతో పెళ్లి రిజిస్ట్రేషన్కు నిబంధనలు అడ్డుగా నిలిచాయి.

సారా విదేశీ యువతి కావడం వల్ల ధ్రువపత్రం ఇవ్వడం కుదరదని అభ్యంతరం తెలిపారు. పెళ్లి రిజిస్ట్రేషన్ అయ్యి.. మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తేనే సారాకు లాంగ్ టర్మ్ వీసా వస్తుంది. అప్పుడే ఆమె తన జీవితాన్ని సురేష్ తో కొనసాగించేందుకు సాధ్యమవుతుంది. ఇదే విషయమై సురేష్ చెబుతూ.. ‘మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తేనే సారాకు లాంగ్ టర్మ్ వీసా వస్తుంది. అప్పుడే ఆమె నాతో కలిసి ఇక్కడే జీవితాన్ని ప్రారంభించే అవకాశం లభిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆమె వీసా గడువు ముగుస్తుంది. కాబట్టి సారా బెల్జియం తిరిగా వెళ్లాల్సి ఉంటుంది’ అని తెలిపాడు. సారాకి భారతీయ సంస్కృతి అన్నా, ఇక్కడి విలువలన్నా చాలా ఇష్టమని అతడు పేర్కొన్నాడు. మరి.. వీరి కథ సుఖాంతం అవుతుందా..? ప్రభుత్వం వీరి పెళ్లికి స్టాంప్ వేస్తుందా..? సారా ఇక్కడే వుండే అవకాశాలున్నాయా..? ఇంతకీ వీరి ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian boy suresh  belgium girl sarah  suresh sarah love story  

Other Articles