TSPSC Chairman Ghanta Chakrapani Released First Notification | Govt Jobs | Jobs Notifications

Tspsc notification released chairman ghanta chakrapani press meet

TSPSC Notification, ghanta chakrapani, telangana jobs notifications, telangana notifications, jobs notifications, jobs updates, jobs applications, telangana jobs, govt jobs updates, engineer jobs

TSPSC Notification Released Chairman Ghanta Chakrapani Press Meet : TSPSC Chairman Ghanta Chakrapani Released First Notification Of Assistant Executive Engineer Posts.

నిరుద్యోగులకు శుభవార్త.. టిఎస్‌పిఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Posted: 08/19/2015 05:51 PM IST
Tspsc notification released chairman ghanta chakrapani press meet

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి నోటిఫికేషన్ విడుదలైంది. 3783 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.  బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు సెప్టెంబర్ 20న పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం కేంద్రాల్లో ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఉద్యోగాల విషయమై విస్తృత సమాచారం తెలియజేస్తూ ఇలా అన్నారు...

* సెప్టెంబర్ 20వ తేదీన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించనున్నాం.
* ఈ నెలాఖరులోగా గ్రూప్ 1, 2 పరీక్షలకు సంబంధించిన సిలబస్ను ప్రకటిస్తాం. నిజానికి సిలబస్ వివరాలను ఉద్యోగ ప్రకటనతో మాత్రమే ఇవ్వాలి. కానీ.. కొత్త సిలబస్ కాబట్టి ముందుగా చదువుకునే అవకాశం ఉంటుందని సిలబన్ ను ముందుగానే ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
* అక్టోబర్ చివరిలో గ్రూప్ 2 నోటిఫికేషన్.. డిసెంబర్ లోపు ఉద్యోగాల నియామకం ఉంటుందని స్పష్టం చేశారు.
* గ్రూప్ 1కు ఇంకా కొన్ని సమస్యలున్నాయని.. వాటిలో 53 పోస్టులను తమకిచ్చారని.. వాటిలో కొన్నింటికి సంబంధించి న్యాయపరమైన సమస్యలున్నాయని తెలిపారు.
* కమలనాథన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మరికొన్ని కొత్త ఖాళీలు రావచ్చని, వాటి ఆధారంగా వాటిని బట్టి నవంబర్ నోటిఫికేషన్లో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశముందని చెప్పారు.
* ఈ ఏడాది డిసెంబర్ లోపు 80 శాతం నియామకాలను  పూర్తి చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
* మార్చికల్లా గ్రూప్ 2 నియామకాలు మొత్తం పూర్తవుతాయని.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. జరిగిన లోపాల్ని సవరించి డిసెంబర్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
* ఈసారి నియామకాలు పారదర్శకంగా వుంటాయని.. విశ్వాసం వున్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని అనుకున్నట్లుగా పేర్కొన్నారు. ఎవరైనా అడ్డుకుంటే తామేమీ చేయలేమని ముందుగానే హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSPSC Notification  Engineer Jobs  Telangana Govt Jobs  

Other Articles