Congress Leader Shabbir Ali Reveals How Kcr Got Telangana Govt | Telangana Politics

Kcr telangana state cm post secrets congress shabbir ali

kcr, kcr news, kcr controversy, kcr updates, shabbir ali news, shabbir ali kcr news, shabbir ali controversy, kcr updates, kcr cm post, shabbir ali controversies

Kcr Telangana State Cm Post Secrets Congress Shabbir Ali : Congress Leader Shabbir Ali Reveals How Kcr Got Telangana Govt By Saying Lie.

కేసీఆర్ కి అధికారం ఎలా దక్కిందో ‘సీక్రెట్’ తెలుసుకోవాల్సిందే!

Posted: 08/19/2015 05:21 PM IST
Kcr telangana state cm post secrets congress shabbir ali

ప్రత్యేక తెలంగాణ కోసం 12 ఏళ్లపాటు ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, దీక్షలు చేపట్టి... చివరికి రాష్ట్రంతోపాటు అధికారాన్ని చేజిక్కించుకున్నారు కేసీఆర్. ఇది అందరికీ తెలిసిన విషయం.. కానీ ఆయనకు అధికారం దక్కడం వెనుక మరో రహస్యం కూడా దాగి వుందట. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టడం వెనకు ఎవరికీ తెలియని రహస్యాలు కొన్ని దాగి వున్నాయట. ఈ విధంగా సరికొత్త అనుమానాల్ని రేకెత్తించింది మరెవ్వరో కాదు.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ! కేసీఆర్ కి అధికారం దక్కడం వెనుకున్న సీక్రెట్స్ ని ఆయన తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా, ఆత్మహత్యలను నివారిస్తా, కరెంటు కోత రానీయను, రైతాంగాన్ని ఆదుకుంటా, ప్రాణహిత - చేవెళ్ల పూర్తి చేస్తా.. ఇటువంటివి మొత్తం 180 అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టినందునే ఆయనకు అధికారం దగ్గరైందని షబ్బీర్ అలీ విమర్శించారు. వికారాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పైవిధంగా కేసీఆర్ మీద మండపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తన ప్రాణమని వ్యాఖ్యానించిన ఆయన, నేడు ఆ ప్రాజెక్టు ప్రాణాలు తీస్తున్నారని దుయ్యబట్టారు. ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఆయనకు తెలియడం లేదని, రోజుకో పథకం ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. మరి.. ఈ వ్యాఖ్యలకు కేసీఆర్ ఏ విధంగా సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  shabbir ali  telangana state  

Other Articles