Nagarjuna University | Police | Lungis | Rishiteshwari

If u wear lungi in naragjuna university u will take into the costody

Nagarjuna University, Police, Lungis, Rishiteshwari, Suicide, Restrictions

If U wear lungi in Naragjuna University u will take into the costody. In Nagarjuna University police restrictions on students wearings. They order to not wearing lungis in capas.

లుంగీ కట్టుకుంటే కటకటాలేనంట

Posted: 08/19/2015 04:29 PM IST
If u wear lungi in naragjuna university u will take into the costody

‘‘లుంగీలు కట్టుకుంటే లోపలేస్తాం...మాట వినకుంటే మక్కెలిరగదీస్తాం... తేడా వస్తే తాట తీస్తాం’’. నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో స్టూడెంట్స్‌కి పోలీసులు ఇస్తున్న వార్నింగ్స్‌ ఇవి. క్యాంపస్‌ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్న పోలీసులు చిత్ర విచిత్రమైన నిబంధనలతో విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నారు. రాత్రి పూట లుంగీలు కట్టుకుని తిరగడంపై నిషేధమే ఇందుకు నిదర్శనం. నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు సాధారణమైపోయాయి. పోలీసులు ఆంక్షలు పెట్టడం, వాటికి వ్యతిరేకంగా విద్యార్ధులు ఆందోళన చేయడం తరచూ జరుగుతోంది.

రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత యూనివర్శిటీ క్యాంపస్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడంతా పోలీస్‌ జోన్‌గా మారిపోయింది. లోపలికి ఎవరు రావాలన్నా, వెళ్ళాలన్నా వాళ్ల పర్మిషన్ తప్పనిసరి. సాధారణ అనుమతుల వరకు ఓకేగాని.. పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారంటున్నారు స్టూడెంట్స్‌. రీసర్చ్‌ స్కాలర్స్‌ ఎక్కువ మందికి రాత్రి భోజనం తర్వాత లుంగీలు కట్టుకునే హాస్టల్‌ ఆవరణ, క్యాంపస్‌లో చెట్ల కింద తిరగడం అలవాటు. ఇప్పుడా అలవాటును మానేయమంటున్నారు పోలీసులు.  చెప్పడంతో సరిపెట్టకుండా చర్యలకు దిగడంతో హాస్టల్‌ ముందు ఆందోళనకు దిగారు స్కాలర్స్‌. మేం లుంగీలు కట్టుకుంటే వాళ్ళకేంటని ప్రశ్నిస్తున్నారు. అసలు క్యాంపస్‌లో సెక్యూరిటీ కోసం వచ్చే పోలీసులే తాగి తందనాలాడుతున్నారని, ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని గొడవకు దిగారు. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని సర్ది చెప్పడంతో శాంతించారు విద్యార్థులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna University  Police  Lungis  Rishiteshwari  Suicide  Restrictions  

Other Articles