Chandrababu Naidu | Cash for Vote | Revanth Reddy

Ap cm chandrababu naidu name listed in the charge sheet on cash for vote case

AP, Chandrababu Naidu, Cash for Vote, Revanth Reddy, Stephenson, Telangana, ACB, Tapping

AP cm Chandrababu Naidu name listed in the charge sheet on cash for vote case. Telangana ACB exibite the phone nos, data conversation between Chandrababu, stephenson.

చంద్రబాబు జైలు జీవితం coming soon..?!

Posted: 08/18/2015 08:50 AM IST
Ap cm chandrababu naidu name listed in the charge sheet on cash for vote case

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు చార్జిషీట్‌లో చంద్రబాబునాయుడు పేరు ను తెలంగాణ ఎసిబి చేర్చింది. దీంతొ ఈ కేసు సంచలనమైన మలుపు తిరిగింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన డిస్కషన్ ట్రాన్స్‌క్రిప్ట్‌ నుంచి కొన్ని భాగాలను చార్జిషీట్‌లో తెలిపారు. అంతేగాక ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి సైతం ఈ వ్యవహారంలో డబ్బులు ఎంతివ్వాలనే తుది నిర్ణయం తీసుకునేది బాబేనని స్టీఫెన్‌ సన్‌ తో చెప్పడాన్ని చార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా తన ఇంటికి వచ్చి కోరిన సందర్భంలో ఇందుకు గానూ చంద్రబాబు తనకు అధికారం ఇచ్చారని చెప్పడాన్ని కూడా చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేగాక ఎన్నికల్లో ఓటు వేసేందుకు 2.5 కోట్ల వరకు తాను ఆఫర్‌ చేస్తున్నట్లు చెప్పి, ఆపై ఎంత కావాలో చెబితే చంద్రబాబుకు తెలియజేయగలనని కూడా రేవంత్‌ చెప్పినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు తనంతట తాను ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయిస్తారని, మీరు వ్యక్తిగతంగా చంద్రబాబును కలవొచ్చని, అది రహస్యంగా ఉంటుందని స్టీఫెన్‌ సన్‌ కు చెప్పారు. అయితే, చంద్రబాబును కలిసేందుకు  స్టీఫెన్‌ సన్‌ తిరస్కరించినట్లు ఛార్జిషీట్‌లో వివరించారు. ప్రత్యేక కోర్టుకు ఎసిబి అధికారులు సమర్పించిన ఛార్జీషీట్‌ ప్రకారం మే 30 సాయంత్రం 4 గంటలకు హ్యారీ సెబాస్టియన్‌ తన మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ 9394326000 నుంచి ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు చెందిన 9949054323 కు ఫోన్‌ చేసి చంద్రబాబునాయుడుతో మాట్లాడించారు. చంద్రబాబునాయుడు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పి మొబైల్‌ ఫోన్‌ అందించారు. ఆ ఫోన్‌ లో చంద్రబాబు దె బ్రీఫ్డ్‌ మి అంటూ మొదలుబెట్టి ఐ యామ్‌ విత్‌ యు..డోంట్‌ బాదర్‌.. , ఐ యామ్‌ విత్‌ యూ.. ఆల్‌ డిమాండ్స్‌ విల్‌ బి ఫుల్‌ ఫిల్డ్‌. (వారు నాకంతా చెప్పారు. నేను మీకు అండగా ఉంటా..కంగారు పడాల్సిందేమి లేదు. అన్ని డిమాండ్లు నెరవేరుస్తాం.) అంటూ మాట్లాడారు. అదేరోజు రాత్రి 9. 33 నిమిషాలకు అదే ఫోన్‌ నుంచి తనకు ఎస్‌ఎంఎస్‌ వచ్చిందని సెబాస్టియన్‌ విచారణలో చెప్పినట్లు ఎసిబి అధికారులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.ఆ ఎస్‌ఎంఎస్‌లో తన మొబైల్‌ నంబర్‌ మారిందని కొత్త నెంబర్‌ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : AP  Chandrababu Naidu  Cash for Vote  Revanth Reddy  Stephenson  Telangana  ACB  Tapping  

Other Articles