Bangkok | huge Bomb Explosion | Bomb Attack

Tourists among 22 killed in apparent attack on bangkok shrine

Bangkok, huge Bomb Explosion, Bomb Attack, Central bangkok

Tourists among 22 killed in apparent attack on Bangkok shrine A huge bomb explosion that appeared to target a popular Hindu shrine in central Bangkok killed at least 22 people Monday and wounded about 120 more, authorities said. Twelve victims died at the scene, and the others died later at area hospitals, officials said.

బ్యాంకాక్ లో బారీ పేలుడు.. 22 మంది మృతి

Posted: 08/18/2015 08:48 AM IST
Tourists among 22 killed in apparent attack on bangkok shrine

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ హిందూ ఆలయం బయట భారీ పేలుడు సంభవించింది. స్థానిక ఎరవన్ ఆలయం వద్ద జరిగిన భారీ పేలుడులో 27 మంది మృత్యువాత పడగా, నలుగురు విదేశీయులు సహా 117 మంది పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత 40 మీటర్ల మేరకు ఉందని అధికారులు తెలిపారు. థాయ్ రాజధానిలో ఇలాంటి పేలుడు తొలిసారి చోటుచేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఘటనాస్థలమంతా హృదయవిదారకంగా మారింది.  పేలుడు ప్రభావంతో మోటారు వాహనాలన్నీ దగ్ధమయ్యాయి.  ఘటనా స్థలంలో లభ్యమైన రెండో బాంబును నిర్వీర్యం చేయడంతో పెద్ద ముప్పు తప్పిందని, క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించామని అధికారులు తెలిపారు.

బ్యాంకాక్‌లోని ప్రధాన వాణిజ్య కూడలి, మూడు షాపింగ్ మాల్స్, హయత్ ఫైవ్‌స్టార్ హోటల్‌కు సమీపంలో ఉన్న ఎరవన్ ఆలయాన్ని ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు, విదేశీ పర్యాటకులు సందర్శిస్తారు. పేలుడుకు ఉపయోగించిన బాంబు టీఎన్‌టీ బాంబ్. పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి, విదేశీయులను లక్ష్యంగా చేసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అని థాయ్‌లాండ్ రక్షణశాఖ మంత్రి ప్రవిత్ వాంగ్‌సువాంగ్ మీడియాతో అన్నారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని ప్రయుథ్ చాన్ ఓచా వార్ రూంను ఏర్పాటు చేశారు. మోటారు వాహనానికి బాంబు బిగించి బాంబును పేల్చివేశారని, ఎలక్ట్రిక్ పోల్‌కు కట్టి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని మరికొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangkok  huge Bomb Explosion  Bomb Attack  Central bangkok  

Other Articles