AP | Telangana | Chandrabu | KCR

Ap cm chandrababu naidu and telangana cm kcr cheating students and unemployees

AP, Telangana, Chandrabu, KCR, Students, Unemployees

AP cm Chandrababu Naidu and Telangana cm KCR cheating Students and unemployees. Telugu state cms promise for job to every one.

వాళ్లను ‘మోసం’ చేసిన కేసీఆర్, చంద్రబాబు

Posted: 08/17/2015 04:36 PM IST
Ap cm chandrababu naidu and telangana cm kcr cheating students and unemployees

పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదే మరి. ఎలక్షన్ సమయంలో మాత్రం మాటల మీద మాటలు ఇచ్చి.. ఎలక్షన్ ల తర్వాత అధికారంలోకి రాగానే అన్ని మరిచిపోయే రాజకీయ నాయకులు తెలుగునాట తక్కువేం కాదు. ఏపిలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ కూడా ఈ లిస్ట్ కు అతీతం కాదు. ఎన్నికల్లో విచ్చల విడిగా హామీలు ఇవ్వడం తర్వాత ఏం చెయ్యాలో అర్థంకాక జుట్టుపీక్కోవడం శరామామూలే. రైతలు రుణ మాఫీల పేరుతో ఇద్దరు ముఖ్యమంత్రులు తొడలు కొట్టిమరీ హామీలిచ్చారు. మేం ఎంత కష్టపడినా సరే.. ఎన్ని ఇబ్బందులున్నా సరే రైతులకు రుణమాఫీ చేశాం అని గొప్పగా మైకులు అదిరేలా చెప్పారు. కానీ అందులో కనిపించని మరోకోణం తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇచ్చే రుణమాఫీకీ సవాలక్ష కండీషన్లు రైతులను ముప్పుతిప్పులు పెట్టాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వల్ల బాగా నష్టపోయిన వాళ్లు ఎవరయ్యా అంటే మాత్రం అది ఖచ్చితంగా నిరుద్యోగులే.

రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యమాల సమయం నుండి ముందు జరిగే పునర్నిర్మాణం, అభివృద్దికి మూల బిందువులైన నిరుద్యోగులు, విద్యార్థులను రెండు తెలుగు రాష్ట్రాలు చులకనగా చూస్తున్నాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు విద్యార్థుల్లో అంతులేని కలలను నింపారు.. ఆకాశానికెత్తేశారు. కానీ తర్వాత మాత్రం వారి గురించి కనీసం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఉద్యోగుల గురించి ఆలోచించిన దాంట్లో కనీసం యాభై శాతం కూడా నిరుద్యోగులు, విద్యార్థుల గురించి ఆలోచించడం లేదు. ఉద్యోగులకు బోనస్ లు, పిఆర్సిలు ఇచ్చేందుకు మీడియా ముందు ఉత్సాహంగా కనిపించే కేసీఆర్ అదే ఉత్సాహంతో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏదైనా చేద్దామన్న ఆలోచనలో మాత్రం ఉండదు.

ఇక ఏపి సిఎం చంద్రబాబు నాయుడు గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. కోడికూర ఎక్కడ అంటే ఈకలు చూపించి... పబ్బంగడిపే రకంగా ఉన్నారు. జిందాతిలిస్మాత్ యాడ్ లాగా అన్ని రోగాలకు కారణం ఒక్కటే చెబుతారు. ఏపికి కనీసం రాజధాని కూడా లేదు కాబట్టి రాష్ట్రానికి కష్టాలున్నాయి... ఏమైనా ఉంటే తర్వాత చూద్దాం అని అమాంతం విషయాన్ని దాటవేస్తారు. కానీ విదేశీ పర్యటనలకు తీసుకునే శ్రద్ద.. తన పర్యటనలకు తీసుకున్న జాగ్రత్తలు తీసుకొని ఎలాగోలా విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు చేద్దామని మాత్రం ఉండదు. నిరుద్యోగల భృతి అన్నారు.. అది ఎప్పుడో అటకెక్కింది. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఆ హామీ ప్రతి ఇంటికి చేరింది కానీ అది మాత్రం నిజం కాలేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Telangana  Chandrabu  KCR  Students  Unemployees  

Other Articles