Cochin International Airport to be India's First to Run on Solar Power

Kochi set to become first airport operating on solar power

Cochin International Airport Ltd,CIAL,Cochin,Oommen Chandy,Kerala Chief Minister,Kochi,Solar power,Solar energy,Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, polavaram, national news, telugu news,

Cochin International Airport is all set to become the first airport in the country which would be operating on solar power, airport officials said

దేశంలోనే తొలి సోలార్ విమానాశ్రయం.. ఎల్లుండే లాంచనంగా ప్రారంభం..

Posted: 08/16/2015 02:05 PM IST
Kochi set to become first airport operating on solar power

కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించనుంది. దేశంలోనే సోలార్‌ పవర్‌తో పనిచేసే తొలి విమానాశ్రయంగా సరికొత్త గుర్తింపును సొంతం చేసుకోనుంది. దేశంలో ఎన్నో విమానాశ్రయాలకు భారీ విస్తర్ణం కలిగిన ప్రాంతాలు వున్న.. వాటిని సద్వినియోగం చేసుకుని సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే అవకాశాలకు తీసుకోవాలని చాటిచెప్పేందుకు కొచ్చి విమానాశ్రయం నిదర్శనంగా నిలుస్తుంది.  ఈ విమానాశ్రయంలో ఇప్పటికే సిద్ధం చేసిన 12 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును ఆగస్టు 18న కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ ప్రారంభించనున్నారు.

ఈ విషయాన్ని విమానాశ్రయ ఎండీ వీజే కురియన్‌ వెల్లడించారు. కార్గో కాంప్లెక్స్‌కు సమీపంలో 45 ఎకరాలలో ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌కు సంబంధించిన పీవీ ప్యానల్స్‌ ఆ రోజు నుంచి అధికారికంగా పని చేయడం ప్రారంభిస్తాయని ఆయన తెలిపారు. విమానాశ్రయానికి ప్రతిరోజుకూ అవసరమైన 50 వేల నుంచి 60 వేల యూనిట్ల విద్యుత్‌ను సోలార్‌ ద్వారా సరఫరా చేయనున్నట్లు కురియన్‌ వివరించారు. ఇక థ్మరల్, హైడల్, అటామిక్, విద్యుత్ సరఫరా లేకున్నా తమ విమానాశ్రయం కేవలం సోలార్ పవర్ తో పనిచేస్తుందని కురియన్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cochin International Airport  CIAL  Solar power  Solar energy  

Other Articles