hyderabad police issues notices to alertless malls after 4 huji terror suspects arrested

Special police check points set up in twin cities due to independence day

police checks, check points, asian theater, hyderabad central, notices, terror attack alerts, alertless malls, hyderabad police issues notices, armed man inside mall, police issues notices to alertless malls, police checking, huji terrorists, 4 arrested, passports recovered, 15 huji sympathisers arrested

In spite of terror attack alerts, hyderabad police issues notices to alertless malls which allowed armed man inside mall

రెడ్ అలర్ట్: పొలీసుల అదుపులో 4 అనుమానితులు.. ప్రముఖ మాల్స్ నోటీసులు

Posted: 08/14/2015 02:53 PM IST
Special police check points set up in twin cities due to independence day

స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని.. ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జంటనగరాల్లో పోలీసులు ముమ్మరంగా భద్రతా చర్యలు  చేపడుతున్నారు. ఈ తరుణంలోనే హుజీ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో నలుగురు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్ పోర్ట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురికి హుజీ తీవ్రవాద సంస్థతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.

వీరితో పాటు మరికొంతమంది ఉగ్రవాద సానుభూతిపరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో పాకిస్థాన్కు చెందిన మహ్మద్ నజీర్  రెండు నెలలుగా హైదరాబాద్లో మకాం వేసినట్లు సమాచారం. పోలీసుల అదుపులో మొత్తం 15మంది సానుభూతిపరులు ఉన్నట్లు తెలుస్తోంది. చాంద్రాయణగుట్ట బాబానగర్లో రెండు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్న ఈ నలుగురిని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడుల దాడి జరగవచ్చని, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హుజీ ఉగ్రవాదులు హైదరాబాద్లో అరెస్ట్ కావటం కలకలం రేపుతోంది.

దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు నగరంలోని పలు సూపర్ మార్కెట్‌లు, మాల్స్‌లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇటు హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోని పంజాగుట్టా, ఎస్ ఆర్ నగర్ ప్రాంతాలలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. దీంతో పాటు ప్రముఖ షాఫింగ్ మాల్స్ లో భద్రత చర్యలను పర్యవేక్షించారు. హైదరాబాద్ సెంటర్ లో డెకాయ్ అపరేషన్ నిర్వహించిన పోలీసులకు అక్కడ భధ్రత లోపభూయిష్టమని తేలింది. గన్ తో ఓ పోలీసు మాల్ లోకి వెళ్లనిచ్చేందుకు అక్కడి సెక్యూరిటీ అనుమతించారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ షాపింగ్ మాల్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అటు సైబరాబాద్ కమిషనరేట్‌  పరిధిలోని సరూర్‌నగర్, చైతన్యపురి పీఎస్ పరిధిలోని దేవాలయాలు, సినిమా హాల్స్‌, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు,  బస్‌ స్టాప్‌లలో తనిఖీలు ముమ్మరం చేశారు. పలు చోట్ల బాంబ్‌ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఆగస్టు 15 అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగుతాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో భాగంగా రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌ ఏషియన్  థియేటర్‌ ఎంక్యూబ్‌ మాల్‌లో పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించారు.  పోలీసులు ఓ వ్యక్తికి పిస్టల్‌నిచ్చి లోపలికి పంపించారు . అయితే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టలేకపోవడంతో  పోలీసులు విస్తుపోయారు. దీంతో ఏషియన్ థియేటర్ సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించి అనుమానితులను ఎలా తనిఖీ  చేయాలో తర్ఫీదు ఇచ్చారు. సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన  ఏషియన్ థియేటర్ యాజమాన్యానికి నోటీసులు ఇస్తామని తెలిపారు.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police checks  check points  asian theater  hyderabad central  notices  

Other Articles