Congress vice-president Rahul Gandhi "sent back" from One Rank, One Pension protest

Set back for rahul at one rank one pension protest

Rahul Gandhi, OROP, Independence day, Delhi Police, Congress, OROP,One Rank One Pension,Jantar Mantar,OROP Protests,OROP Protest,Independence Day,Independence Day security, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, polavaram, national news, telugu news,

Congress vice-president Rahul Gandhi on Friday was jeered by former servicemen protesting the delay in the implementation of one-rank one- pension (OROP).

రాహుల్ గాంధీకి చేధు అనుభవం.. రిటైర్టు అర్మీ ఆందోళన నుంచి వెనక్కి..

Posted: 08/14/2015 04:56 PM IST
Set back for rahul at one rank one pension protest

కాంగ్రెస్ యువనేత, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి న్యూఢిల్లీలో పరాభవం ఎదురైంది. ఒకే ర్యాంక్‌, ఒకే పెన్షన్‌ విధానాన్ని అమలు కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మాజీ సైనికులు చేపట్టిన దీక్షస్థలి వద్ద రాహుల్ గాంధీకి చేధు అనుభవం ఎదురైంది. అయితే రాజకీయమే తెలియదని, విజ్ఞానం లేని నిపుణుడని అరోపణలు చేసిన అధికార పక్షం ఖంగు తినేలా ఆయన చాలా హుందంగా అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ విధానం అమలు చేయాలని మాజీ సైనికులు అందోళన చేపట్టిన సభా వేదికకు వచ్చి తన మద్దతును తెలిపేందుకు రాహుల్ గాంధీ వచ్చారు. అయితే రాహుల్ గాంధీని రాహుల్ వెళ్లిపో అన్న స్లోగన్స్ స్వాగతం పలికాయి.

పవిత్రమై తమ ఆందోళనను కేవలం ఫోటో సెషన్ గా మార్చవద్దని ఒక అందోళనకారుడు బిగ్గరగా అరిచాడు. దీంతో పలువురు రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగిన రాహుల్.. ప్రధాని మాజీ సైనికుల డిమాండ్లను ఎప్పటి లోగా పరిష్కరిస్తారో చెబుతూ.. ఒక తేదీని వెంటనే వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో మాజీ సైనికుల ఉద్యమాలు చల్లారుతాయన్నారు. తాను ఒక పార్టీకి ప్రతినిధిగా ఇక్కడకు రాలేదని, తమ యవ్వనాన్ని భారత సరిహద్దులో గడిపి అనునిత్యం భారత మాత సేవలో గడిపిన మాజీ సైనిక ఉద్యోగులు, జవాన్లు అందోళన చేయడంతో చెలించి తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. వారిని నిరసనను వ్యక్త పర్చకుండా ఇక్కడి నుంచి తరమివేయాలని పోలీసులు యత్నించడాన్ని తప్పుబట్టారు.

దేశం కోసం శ్రమించిన జవాన్ల అవసరాలను తీర్చడం, హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యతగా చెప్పుకోచ్చారు. అంతకు ముందు మాజీ సైనికులు చేస్తున్న ఆందోళనను పోలీసులు చెదరగోట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అటు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా మాజీలు బ్లాక్ ఇండిపెండెన్స్ డే అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత కూడా చోటుచేసుకుంది. దీనిని గమనించే తాను అక్కడికి వచ్చానని రాహుల్ గాంధీ చెప్పుకోచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  OROP  Independence day  Delhi Police  Congress  

Other Articles