Modi | NiteshKuamar | Bihar | Elections

Expect 50 lakh dna samples soon says nitish kumar to pm modi

modi, NiteshKuamar, Bihar, Elections, Narendra Modi, Bihar elections, BJP, Twitter, DNA

Expect 50 Lakh DNA Samples Soon Says Nitish Kumar to PM Modi Prime Minister Narendra Modi can expect a rather large delivery soon, according to Nitish Kumar. 50 lakh samples of DNA are to be sent to Delhi, the Bihar Chief Minister proclaimed, in a mass protest against the PM's recent remarks.

మోదీ, నితీష్ మధ్యలో డిఎన్ఎ

Posted: 08/10/2015 12:49 PM IST
Expect 50 lakh dna samples soon says nitish kumar to pm modi

బీహార్ ఎన్నికల నేపధ్యంలో మోదీకి, నితీష్ కుమార్ కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తూ మోదీ, నితీష్ కుమార్ లు ఒకరి మీద మరొకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా నితీష్ కుమార్ ను ఓడించి. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మోదీ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా నితీష్ కుమార్ ను టార్గెట్ గా చేసి మాటల తూటాల వర్షం కురిపించారు. అయితే మోదీ మాటకు నితీష్ కౌంటర్ వేశారు. తన డిఎన్ఎలో ఏదో తప్పుగా ఉంది అని మోదీ చేసిన వ్యాఖ్యల మీద నితీష్ కూడా కౌంటర్ వేశారు. 50వేల మంది బీహారీల డిఎన్ఎలను మోదీకి పంపిస్తామని చూసుకోవాలని నితీష్ అన్నారు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది ట్విట్టర్‌ ప్రభుత్వమని కేవలం ట్విట్టర్‌ నుంచి తెలుసుకోవడం, స్పందించడం చర్యలు తీసుకోవడం అన్ని కూడా అక్కడ నుంచేనని ప్రధాని నరేంద్ర మోడీ నుద్దేశించి బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ ధ్వజమెత్తారు.గయాలో ప్రధాని మోడీ తమను ఉద్దేశించి చేసిన 'ఆ విష సర్పాలను నమ్మొద్దు' అనే వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.మోడీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మనకున్నది యూనియన్‌ ప్రభుత్వం కాదు. 'యూనియన్‌ ట్విట్టర్‌ ప్రభుత్వమని' చమత్కిరించారు. మోడీ పాలన చేపట్టి ఏడాది దాటినా రైతులకు చేసిందేమి లేదని ధ్వజమెత్తారు. అంతేకాకుండా తాను అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు మోడీ సమాధానం ఇవ్వలేదన్నారు. నేర చరిత ఉన్న వారికి ఎన్నికల టిక్కెట్లు ఇవ్వమని హామీ ఇచ్చిన మోడీ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. త్వరలో జరుగుతున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ నేర చరిత ఉన్న వాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, మీరు కూడా ఆ మాట నిలబెట్టుకుంటారా? అని నితీష్‌ ప్రధానికి సవాల్‌ విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  NiteshKuamar  Bihar  Elections  Narendra Modi  Bihar elections  BJP  Twitter  DNA  

Other Articles