Alka Lamba | Delhi | AAP | Kejriwal

Cctv footage shows aap mla vandalised shop with supporters

Alka Lamba, Delhi, AAP, Kejriwal, Aam Admi Party, Chandini chowk

CCTV footage shows AAP MLA vandalised shop with supporters A CCTV footage recovered from a sweet shop in Kashmere Gate on Sunday shows AAP's Chandni Chowk MLA Alka Lamba vandalising it along with her supporters.CCTV footage: AAP's Alka Lamba, supporters ​vandalise shop during anti-drug drive

రౌడీ ఎమ్మెల్యే.. హోటల్ పై దాడి చేసి రచ్చ

Posted: 08/10/2015 12:19 PM IST
Cctv footage shows aap mla vandalised shop with supporters

ఏంటీ టైటిల్ చూడగానే ఎమ్మెల్యే రౌడీనా ..? చాలా మందే ఉన్నారు కదా అని కూడా అనుకోవద్దు ఎందుకంటే ఈ రౌడీ ఎమ్మెల్యే ఓ మహిళ. అవును అమ్మగారు ఎమ్మెల్యేగా ఉంటూ రౌడీయిజం చేస్తున్నారు. దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిచినట్లు అమ్మగారు రౌడీగిరి చేసి.. తన మీద రాళ్ల దాడి చేశారంటూ కలరింగ్ ఇచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏంటీ అంటే ఓ మహిళా ఎమ్మెల్యే ఓ హోటల్ మీద తన మందీమార్భలంతో వచ్చి నానాయాగి చేసింది. హోటల్ లో ఉన్న మెషీన్ ను విసిరికొట్టి.. క్యాష్ కౌంటర్ ను కూల్చేసింది. మొత్తానికి కత్తులు తీయడం తప్ప అన్నీ చేసేశారు ఆ ఎమ్మెల్యే గారు. మొత్తం సీన్ సిసిటివి రికార్డుల్లో ఉండటంతో అమ్మగారు అండ్ కో అవాక్కయ్యారు.



ఢిల్లీ లో అధికారంలో ఉన్న ఆప్ఎమ్మెల్యే ఆల్క లంబా చేసిన నిర్వాకం మీడియాలో రావడంతో పెద్ద దుమారమే రేగుతోంది. రాజకీయాలను సమూలంగా మార్చేస్తాం.. అవినీతిని పీకి పాతరేస్తాం అన్న కేజ్రీవాల్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అంటూ ప్రతిపక్షాలు ఒంటి కాలి మీద లేస్తున్నాయి. ఆప్ ఎమ్మెల్యే ఆల్క లంబా ఢిల్లీలోని ఓ హోటల్ లోకి తన అనుచరులతో ప్రవేశించింది ఆల్క లంబా. ఆల్క లంబా అక్కడే ఉన్న క్యాష్ మెషీన్ ను విసిరికొట్టింది. తర్వాత వెంటనే అక్కడికి వచ్చిన అమ్మగారి అనుచరులు కౌంటర్ ను విసిరిపారేశారు. అయితే మొత్తం మ్యాటర్ సిసిటివి పుటేజీల్లో నమోదైంది. నిన్నటి దాకా మాత్రం ఆల్కా లంబా మీద దాడి జరిగింది.. దుండగుల రాళ్ల దాడి అదీ ఇదీ అని కూసిన మీడియా ఛానళ్లు కూడా అమ్మగారి నిజస్వరూపాన్ని మళ్లీ మళ్లీ జనాలకు చూపిస్తున్నాయి. మొత్తానికి ఢిల్లీలో రౌడీ ఎమ్మెల్యే ఎవరు అంటే మాత్రం ఆల్క లంబా పేరు వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alka Lamba  Delhi  AAP  Kejriwal  Aam Admi Party  Chandini chowk  

Other Articles