Governor | Narasimhan | Telangana | AP

Governor narasimhan said that telugu states clashes will end soon

governor, Narasimhan, Telangana, AP, Cash for vote, Tapping

Governor Narasimhan said that Telugu states clashes will end soon. Te;angana , ap state are fighting from the past five months, the Governor Narasimhan hope to end of the fighting.

తెలుగు రాష్ట్రాల మధ్య అన్నీ సద్దుమణుగుతాయి

Posted: 08/08/2015 12:33 PM IST
Governor narasimhan said that telugu states clashes will end soon

తెలంగాణ, ఏపీ ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నేడు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం గవర్నర్ నరిసింహన్ మీడియాతో మాట్లాడుతూ... జాతీయ, రాష్ట్ర విషయాలపై సమావేశంలో చర్చించాం. ఉద్యోగుల విభజన అంశాన్ని కేంద్రం చూసుకుంటుంది. రాష్ర్టాల మధ్య వివాదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. మొత్తానికి గత కొంత కాలంగా రెండు రాష్ట్రాల సిఎం లు కూడా కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది. మరి నిజంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కలమాలు మాని కలిసిపోతారా చూడాలి.

ఓటుకు నోటు, ట్యాపింగ్ వివాదాలతో తెలుగు రాష్ట్రాల సిఎంలు ఒకరి మీద మరొకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సై అంటే తెలంగాణ సిఎం కేసీఆర్ సైసై అన్నంతగా తయారైంది. అయితే అది కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వివాదం కాస్త కేంద్రం వరకు వెళ్లింది. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకోవడం కాస్త ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించింది. అయితే రెండు రాష్ట్రాల వివాదాలను పరిష్కరించడంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విఫలమయ్యారని కూడా గతంలో ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. గవర్నర్ నరసింహన్ తాజాగా వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor  Narasimhan  Telangana  AP  Cash for vote  Tapping  

Other Articles