Rahul asks how much money Lalit Modi paid the Swaraj family

Sushma swaraj is an expert in theatrics says sonia gandhi

parliament monsoon sessions, sonia gandhi, sushma swaraj, drama, congress MPs suspension, Loksabha, sumitra mahajan, Narendra modi, vasundhara raje, shiv raj sungh chouhan, vyapam scam, congress, rahul gandhi, gandhi statue, Lalitgate, Lalit Modi

Sonia and Rahul Gandhi attacked sushma swaraj on Friday. While Sonia Gandhi called Sushma Swaraj an expert at theatrics, Rahul Gandhi went one step further to ask how much money Lalit Modi had paid Swaraj's family to help him stay out of jail.

సుష్మావి నాటకాలు.. ఎంత డబ్బు ముట్టిందో చెప్పాలని రాహుల్ నిలదీత

Posted: 08/07/2015 03:17 PM IST
Sushma swaraj is an expert in theatrics says sonia gandhi

ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కోంటున్న ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోడీ అంశంలో సహకరించిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, ముఖ్యమంత్రి వసుందరా రాజేలను తక్షణం పదవుల నుంచి తప్పించాలని, వ్యాపం స్కాంలో అభియోగాలను ఎదుర్కోంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లను విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్‌ ఎంపీలు వరుసగా నాల్గవ రోజు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభలో 25 మంది కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

బీజేపీ అవినీతిపై నిలదీస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం పాటిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. ‘‘ప్రభుత్వానికి సిగ్గు లేదు... ప్రధానమంత్రికి మాటల్లేవంటూ’’ ఫ్లకార్డులు ప్రదర్శించారు. మనసులో మాటలు, ప్రవచనాలు చెప్పడం మానేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రుల అవినీతి గురించి మాట్లాడాలని కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లతో వెంటనే రాజీనామా చేయించాలని కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. అంతవరకు ఎలాంటి చర్చ జరగనివ్వబోమని వారు స్పష్టం చేశారు.

పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు మరోసారి నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పై తీవ్ర స్వరంతో, అనూహ్యరీతిలో విరుచుకుపడ్డారు. సుష్మా స్వరాజ్ నాటకాలాడటంలో నేర్పరి అని దుయ్యబట్టారు. 'ఒకవేళ నేనే గనుక సుష్మా స్థానంలో ఉండి ఉండేదుంటే ఆపదలో ఉన్నవారికి తప్పక సహాయం చేసేదాన్ని.. అయితే చట్టపరిధిని మాత్రం మీరేదాన్ని కాదు' అని సోనియా అన్నారు.

కేవలం మానవతా దృక్పథంతోనే లలిత్ మోదీకి సహాయం చేశానని సుష్మాస్వరాజ్ చెప్పడాన్ని అమె తప్పుబట్టారు. తాను అమె స్థానంలో వున్నా ఇలానే చేసేవారన్న సుష్మా వ్యాఖ్యలకు కౌంటర్గా సోనియా ఈ కామెంట్లు చేశారు. కాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన తల్లి అలా వ్యవహరించిం వుందేది కాదని అన్నారు. లలిత్ మోడీ నుంచి తెరచాటుగా డబ్బు తీసుకున్న సుష్మాస్వరాజ్ అయనకు సహకరించిందని అన్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖలో ఎవరికీ తెలియకుండా కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయని ఆరోపించారు. ఎక్కడైతే దొంగతనాలు జరుగుతాయో అక్కడ లావాదేవీలకు అస్కారముంటుందని అన్నారు. తన కూతురు, భర్తల మోడీ నుంచి ఎంత డబ్బు తీసుకువచ్చారన్న విషయాన్ని అమె దేశ ప్రజలకు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parliament monsoon sessions  sonia gandhi  sushma swaraj  

Other Articles