Terrorist | Usman | India | Pakistan

Terrorist usman told that they came to kill hindus in india

Terrorist, Usman, India, Pakistan, Jammu Kashmir, BSF, Police

Terrorist Usman told that they came to kill hindus in India. Security officers caught terrorist, who attacked in Jammu Kashmir.

హిందువులను చంపడానికే భారత్ వచ్చాం

Posted: 08/06/2015 08:22 AM IST
Terrorist usman told that they came to kill hindus in india

హిందువులను చంపడానికే భారతదేశానికి వచ్చా, అది చాలా సరదాగా ఉంటుంది.. ఈ వ్యాఖ్యలు చేసిందెవరో తెలుసా.. భద్రత బలగాలకు పట్టుబడిన ఉగ్రవాది ఉస్మాన్ అలియాస్ మహమ్మద్ నావెద్. అతని అసలు లక్ష్యం భారత సైనికులను చంపడమట. తర్వాతి టార్గెట్ అమర్ నాథ్ యాత్రికులట. దాదాపు ఏడేళ్ల క్రితం ముంబయిలో లష్కరే తొయిబా ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. మళ్లీ ఇప్పుడు పడగ విప్పారు. దేశంలో నరమేథం సృష్టించేందుకు వచ్చిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకడు బీఎస్ ఎఫ్ జవాన్ల కాల్పుల్లో చనిపోయాడు. రెండోవాడైన ఉగ్రవాది ఉస్మాన్ అలియాస్ మహమ్మద్ నావెద్ ప్రాణాలతో దొరికిపోయాడు.

Also Read :  అమర్నాథ్ యాత్ర,, భారత సైన్యమే టార్గెట్..

నావెద్ పట్టుబడినా, ఆ భయం అతని మొహంలో ఇసుమంతైనా కనిపించలేదు. జనం తనను ఏవగింపుగా చూస్తున్నారన్న పశ్చాత్తాపమే లేదు. పైగా, తననేదో సన్మానానికి తీసుకెళ్తున్నారన్నంత సరదాగా భద్రత బలగాలతో కలిసి నడిచాడు. ఎవరేం అడిగినా టకీటకీమని సమాధానాలు చెప్పాడు. తాను సైన్యం చేతుల్లో చనిపోతే చాలా సంతోషించేవాడినంటూ చెప్పుకొచ్చాడు. భారత్ లో మారణహోమం సృష్టించాలన్న కుతంత్రం వెనుకున్నది పాకిస్థానేనన్నది నావెద్ మాటలతో తేలిపోయింది. అదృష్టవశాత్తు భారీ ప్రాణనష్టం జరక్కముందే ఈ రాక్షసుడిని పట్టుకున్నారు బీఎస్ ఎఫ్ జవాన్లు.

Also Read : హైదరాబాద్ లో ఉగ్రవాదులు.. ఎప్పుడైనా దాడి చేయవచ్చు

ఏడేళ్ల నాటి ముంబై దాడుల నుంచి ఇప్పటి పాక్ కుతంత్రం వరకు.. ఎన్నో దాడులు జరిగాయి. ఎన్నో ప్రాణాలు పోయాయి. కానీ, ఈ దుర్మార్గాన్ని దుమ్మెత్తిపోస్తూ దేశమొత్తం ఒక్కతాటిపైకి వచ్చింది లేదు. ఇంకా ఎందరు కసబ్ లు ఈ దేశానికి రావాలి..? ఇంకెంత మారణహోమం జరిగాలి..? ఎప్పటికి దేశ జనమంతా ఒక్కటై గట్టిగా నినదిస్తారు..? వట్టి హెచ్చరికలే తప్ప గట్టి చర్యలు చేపట్టని పాలకుల్లో చిత్తశుద్ధిని శంకించాల్సిన సమయమిదే. బీసీసీఐనే నయం. పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాల్ని తెంపేసుకుంది. ఆపాటి తెగువ కూడా కేంద్రం చూపడం లేదు. మనది శాంతికాముక దేశమన్నది ముమ్మాటికీ నిజం. అలాగని, పక్కదేశం దురాక్రమణ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? అమాయకుల ప్రాణాల్ని తీస్తుంటే మాటలతోనే సరిపెట్టాలా..? మొక్కై వంగనిది మానై వంగదంటారు. సీమాంతర ఉగ్రవాదం కూడా చెట్టై, చెదలపుట్టై విస్తరిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terrorist  Usman  India  Pakistan  Jammu Kashmir  BSF  Police  

Other Articles