Life time jail | Ragging | Rishiteshwari

Ap govt warned students who ragg in colleges

Life time jail, Ragging, Rishiteshwari, Ganta srinivas, Ragging Ban, Rishiteshwari suicide

Ap Govt warned students who ragg in colleges. Minister Ganta Srinivas said that ap govt will bring new law for ragging.

ర్యాగింగ్ చేస్తే జీవిత ఖైదు..? రిషితేశ్వరి ఘటనతో ఏపి సర్కార్ యోచన

Posted: 08/03/2015 03:43 PM IST
Ap govt warned students who ragg in colleges

ఏపి రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్ కు వ్యతిరేకంగా చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  సెలబ్రెటీల ద్వారా ర్యాగింగ్ మీద ప్రచారం కల్పించాలని ఏపి ప్రభుత్వం ఆలొచిస్తున్నట్లు ఏపి మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడించారు. నాగార్జున యూనివర్సిటి క్యాంపస్ లో రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తీవ్ర దుమారం రేపింది. కాలేజిలో ర్యాగింగ్ ను తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని విద్యర్థులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రిషితేశ్వరి తన సూసైడ్ నోట్ లో కాలేజీలొ ర్యాగింగ్ భూతం గురించి వెల్లడించడం సర్వత్రా చర్చకు దారి తీసింది. అయితే రిషితేశ్వరి మృతి మీద వేసిన బాలసుబ్రహ్మణ్యం కమిటి తన నివేదికను మరో పది రోజుల్లో సమర్పించనున్నట్లు గంటా శ్రీనివాస్ వెల్లడించారు.

నాగార్జున యూనివర్సిటీలో కాకుండా అన్ని చోట్ల ర్యాగింగ్ మీద విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలేజీలొ ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని గంటా శ్రీనివాస్ హెచ్చరించారు. ర్యాగింగ్ కు పాల్పడితే జీవిత ఖైదు విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలొచిస్తున్నట్లు గంటా వెల్లడించారు. సిఎం చంద్రబాబు నాయుడు రిషితేశ్వరి ఘటన మీద సీరియస్ గా ఉన్నారని గంటా వెల్లడించారు. త్వరలోనే రిషితేశ్వరి కుటుంబాన్ని ఓదార్చనున్నట్లు టిడిపి వర్గాలు భావిస్తున్నాయి కూడా. అయితే రిషితేశ్వరి వివాదంతో మొదలైన ర్యాగింగ్ వివాదం మీద విద్యార్థి లోకం నినదిస్తోంది. కాలేజీ ఆవరణల్లో ర్యాగింగ్ కు పాల్పడితే విద్యార్థుల మీద చర్యలు తీసుకోవడంతో పాటుగా.. కాలేజీలకు గుర్తింపు కూడా రద్దు చేస్తామని గంటా గట్టిగా హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Life time jail  Ragging  Rishiteshwari  Ganta srinivas  Ragging Ban  Rishiteshwari suicide  

Other Articles