బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘పీకే’ చిత్రం సరికొత్త రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇదివరకు ఏ సినిమా రాబట్టని భారీ వసూళ్లను కొల్లగొట్టేసింది. అంతెందుకు.. చివరికి చైనాలోనూ విడుదలై ఈ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రం మనన్నలు పొందింది. ఈ విధంగా భారీ స్థాయిలో విజయకేతనం ఎగరవేసిన ఈ చిత్రం... మొదటినుంచి వివాదాల్లో చిక్కుకుంటూ వచ్చింది. ఆ వివాదాలు ఎలాగోలా సమసిపోయాయిగానీ.. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ఓ అసభ్యకరమైన వ్యాఖ్య వుందని అమీర్ ఖాన్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పోలీసులను ఉద్దేశించి ‘తుల్లా’ అనే పదాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే! ఇప్పటికీ ఇదే విషయమై ఢిల్లీలో రచ్చ కొనసాగుతోంది. ఇదే ‘తుల్లా’ పదాన్ని ‘పీకే’ సినిమాలో కూడా అమీర్ ఖాన్ పోలీసులను ఉద్దేశించి ఉపయోగించాడని ఆరోపిస్తూ.. ఉల్లాన్ అనే ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ పదాన్ని ఉపయోగించినందుకు సీఎం స్థాయిలో వున్న కేజ్రీవాల్ పైనే కేసు నమోదైనప్పుడు, అమీర్ ఖాన్ పై కూడా నమోదు చేయాల్సిందేనని అతగాడు కోరాడు. ఆదారాల కోసం ‘పీకే’ సినిమా డివిడిలను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో, అమీర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి.. దీనిపై అమీర్ ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నాడో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more