Pakistan PM Nawaz Sharif Convoy Attacked By Suspicious Car In Islamabad | Pakistan Crime News

Pakistan pm nawaz sharif convoy attacked by suspicious car in islamabad

Nawaz Sharif news, pakistan pm Nawaz Sharif, Nawaz Sharif convoy hit by car, Nawaz Sharif family members, Nawaz Sharif islamabad news, pakistan crime news, pm attack by former commander, Lashkar-e-Jhangvi militant

Pakistan PM Nawaz Sharif Convoy Attacked By Suspicious Car In Islamabad : Pakistan Prime Minister Nawaz Sharif and his family had a scare on Sunday after a suspicious car approached the convoy in which they were traveling.

ప్రధానికి తప్పిన ప్రమాదం.. మాజీ సైనికుడి దాడి

Posted: 08/03/2015 11:21 AM IST
Pakistan pm nawaz sharif convoy attacked by suspicious car in islamabad

కోపం కట్టలు తెంచుకుంటే ప్రతిఒక్కరూ పిచ్చివాడిలా ప్రవర్తిస్తారు. తమకు నచ్చనివారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడుతుంటారు. ముఖ్యంగా తమకు తీవ్ర మనోవేదనకు గురిచేసిన వారిని చంపేయాలన్న కసి వారిలో రగులుతుంటుంది. ఇలాగే కోపంతో రగిలిపోయిన ఓ మాజీ సైనికుడు.. ఏకంగా ప్రధాని ప్రాణాలనే బలిగొనేందుకు ప్రయత్నించాడు. నిజానికి అతగాడు దాడి చేయడం వెనుక అసలు కారణమేంటో తెలియదు కానీ.. ప్రాణాపాయం నుంచి ప్రధాని, ఆయన కుటుంబసభ్యులు సురక్షితంగానే బయటపడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆదివారం తన కుటుంబసలభ్యులతో కలిసి కారులో ముర్రీలోని హిల్ రిసార్ట్ నుంచి ఇస్లామాబాద్ కు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్ పైకి ఆ దేశ వైమానిక దళానికి చెందిన మాజీ అధికారి హఫీజ్ ఉర్ రెహ్మాన్ మెరుపు దాడికి దిగాడు. కారుతో వేగంగా దూసుకువచ్చిన రిటైర్ట్ ఎయిర్ కమాండర్.. నవాజ్ షరీఫ్ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు.

నకిలీ నెంబర్ ప్లేట్ కలిగిన కారుతో వేగంగా దూసుకువచ్చిన రెహ్మాన్.. తొలుత షరీఫ్ కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేశాడు. ఆ తర్వాత షరీఫ్ ఉన్న కారును తన కారుతో ఢీకొట్టాడు. వెనువెంటనే అప్రమత్తమైన పోలీసులు రెహ్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. అతగాడు ఈ దాడికి పాల్పడటం వెనుకున్న రహస్యమేంటో తెలుసుకునే దిశగా విచారణ చేపట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nawaz sharif  pakistan crime news  hafeez ur rehman  

Other Articles