Maoists attack NMDC mining equipment at Dhantewada in Chhattisgarh | Crime news

Maoists attack nmdc mining equipment dhantewada chhattisgarh

chhattisgarh attack, Maoists attack NMDC, Maoists Attack Chattisgarh, chattisgarh maoists attack, Maoists attack NMDC mining, nmdc mining equipment, Maoists attacks, chhattisgarh maoists attacks

Maoists attack NMDC mining equipment Dhantewada Chhattisgarh : Attack by Maoists has damaged NMDC mining infrastructure at Dhantewada in Chhattisgarh.

ITEMVIDEOS: ఛత్తీస్ గఢ్ లో మావోల ఉగ్రరూపం.. హోరాహోరీ కాల్పులు

Posted: 08/03/2015 10:52 AM IST
Maoists attack nmdc mining equipment dhantewada chhattisgarh

నిన్నటికి నిన్న పంజాబ్ లోని గుర్దాస్ పూర్ లో పాక్ ఉగ్రవాదులు ఓ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, ఎస్పీతోపాటు 13 మందిని పొట్టనపెట్టుకోగా.. తాజాగా ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఉగ్రరూపం దాల్చి హోరాహోరీ కాల్పులు జరిపారు. మావోలకు అడ్డాగా పిలువబడే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్ఎండీసీ’ ఆధ్వర్యంలోని గనులపై ఒక్కసారిగా దాడి చేశారు.

ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మావోయిస్టులు అన్నివైపుల నుంచి గనులను చుట్టుముట్టేశారు. ఆ తర్వాత ముప్పేట దాడి చేశారు. అయితే.. అక్కడ భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ బలగాలు కూడా వారి దాడిని సమర్థవంతంగానే ఎదుర్కొన్నాయి.రాత్రి 11 గంటల నుంచి 2 గంటల దాకా మావోలు, సీఐఎస్ఎఫ్ బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ప్రాణనష్టం అయితే సంభవించలేదు కానీ.. ఆస్తినష్టం బాగానే జరిగింది. సీఐఎస్ఎఫ్ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో మావోలు ఎన్ఎండీసీకి చెందిన పలు వాహనాలు, యంత్రసామాగ్రిని నిప్పు పెట్టేశారు. దీంతో.. రూ.50 కోట్ల విలువ చేసే పరికరకాల అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.

మావోలు జరిపిన ఈ కాల్పులతో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టులు తిరిగి మళ్లీ కాల్పులు జరిపే అవకాశం వుందనతో భావనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. కాల్పులు జరిపిన మావోలు దగ్గర ప్రాంతంలోనే వుండే సూచనలున్నాయని భావించిన అధికారులు.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoists attack NMDC  chhattisgarh attacks  

Other Articles