Charminar | Mahamood Ali | Telangana | Osmania Hospital | Heritage

Telangana depty cm mahamood ali gave explanation on his statements about charminar

Charminar, Mahamood Ali, Telangana, Osmania Hospital, Heritage

Telangana Depty Cm Mahamood Ali gave explanation on his statements about Charminar. Mahamood Ali said that the Charminar will live for ever.

చార్మినార్ గురించి అలా అనలేదు: మహమూద్ అలీ

Posted: 08/03/2015 09:43 AM IST
Telangana depty cm mahamood ali gave explanation on his statements about charminar

ఉస్మానియా ఆస్పత్రిని ఏంటి.. చార్మినార్ కు అదే పరిస్థితి వస్తే దాన్ని కూడా కూలుస్తాం అన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చుకున్నారు. ఎప్పటివరకైతే ప్రపంచం ఉంటుందో.. అప్పటివరకు చార్మినార్ సురక్షితంగానే ఉంటుందని మహమూద్ అలీ స్పష్టం చేశారు. తెలంగాణకే చార్మినార్ తలమానికమని అభివర్ణించారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించి.. చార్మినార్‌ను కూల్చివేస్తామని చెప్పినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చార్మినార్‌ను రక్షించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.

రాష్ట్రప్రభుత్వం తన లోగోలోనే ఈ చారిత్రక నిర్మాణానికి స్థానం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, ఉస్మానియా దవాఖాన తరలింపు కేవలం నిరుపేద రోగులు, వైద్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా భవనం శిథిలావస్థకు చేరుకుందని, రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా.. ఐదేండ్ల కంటే ఎక్కువ నిలువదని ప్రముఖ ఆర్కిటెక్ట్ నిపుణులే చెప్పారని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అందుకే దానిని కూల్చివేసి, అత్యాధునిక దవాఖానను నిర్మించాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. దేశంలోనే నంబర్ వన్ దవాఖానను నిర్మించడంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని చెప్పారు. మూడు వేల పడకల సామర్థ్యం, అత్యాధునిక సదుపాయాలతో ఉస్మానియా దవాఖానను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charminar  Mahamood Ali  Telangana  Osmania Hospital  Heritage  

Other Articles