Rapolu Ananda Bhaskar demands to CBI Probe in Rishiteshwari Case

Mp rapolu demands cbi probe in rishiteswari sucide case

MP Rapolu demands cbi probe in rishiteswari sucide case, Rapolu Ananda Bhaskar, CBI Probe, Rishiteshwari Case, Rajnath singh, ragging in Nagarjuna University, MP kavitha, MP kavitha, students protest, cbi probe, Rishiteswari's parents objects probe, four-member committee inquiry, suicide’ of Rishiteswari, holidays, three senior students arrested, Nagarjuna university, retired bureaucrat, retired IAS officer S Balasubramaniam, remand dairy

Rapolu Ananda Bhaskar demands to CBI Probe into the ‘suicide’ of Rishiteswari, and ragging that prevails in Nagarjuna University

ITEMVIDEOS: ‘రిషితేశ్వరి’ కేసుపై సిబిఐ దర్యాప్తు జరిపించండీ.. రాజనాథ్ తో రాపోలు..

Posted: 08/02/2015 08:31 PM IST
Mp rapolu demands cbi probe in rishiteswari sucide case

నాగార్జున వర్సిటీలో బ్యాచిలర్ ఆప్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థిని రుషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ తెలంగాణ నేతల నుంచి పైకి లేస్తుంది. టీఆర్ఎస్ అధినేత తనయ,  నిజామాబాద్ ఎంపీ కవిత తరువాత, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద బాస్కర్ కూడా ఇదే డిమండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలసి రిషితేశ్వరి కేసుపై సిబిఐ విచారణ జరిపించాలని అభ్యర్థించారు.

రిషితేశ్వరిని శారీరికంగా, మానసింగా అనేక ఇబ్బందులకు గురిచేయడంతోనే అమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాగా, నాగార్జున విశ్వవిద్యాలయంలో జడలు విప్పిన ర్యాగింగ్ భూతం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని, ర్యాగింగ్ నివారించడంలో కాలేజీ ఉన్నతాధికారులు నిర్ళక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకువచ్చారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిజానిజాలు వెలుగుచూడాలంటే.. సిబిఐ దర్యాప్తు ఒక్కటే మార్గమని ఆయన కేంద్రమంత్రికి చెప్పినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై నిజానిజాలను వెలికితీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాను లేఖ  రాస్తానని రాజ్ నాత్ సింగ్ తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rapolu Ananda Bhaskar  CBI Probe  Rishiteshwari Case  Rajnath singh  

Other Articles