India ranks second on list of kidnapping hotspots

India ranks second only to mexico in abductions

Mexico, India, Pakistan, Afghanistan, insurance companies, kidnapping hotspots, abductions, kidnap, Kidnap and Ransom insurance policies, Future Generali India Insurance Company, premium, Web Exclusive, kidnapping, nigerian news, nigeria, lagos, abuja, port harcourt, breaking news in nigeria, boko haram, pdp, business, politics, entertainment, africa, metro, education, sports, commerce and industry, style, world news

India ranks second only to Mexico on the list of kidnapping hotspots around the world.

మనవాళ్లు.. కిడ్నాప్(‘కింగ్’)లేనట..

Posted: 08/02/2015 08:14 PM IST
India ranks second only to mexico in abductions

భారత్ లో ప్రతిభావంతులకు కొదవలేదు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంలి నూతన అవిష్కరణ జరిగినా.. అందులో మనవారి పేర్లు వుంటాయి. అంతలా మన దేశస్తులు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు. అలా అని భారత్ లో నీచ కార్యకలాపాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అధికంగానే వుందని స్పష్టం చేస్తుంది ఓ విదేశీ నివేదిక. ఇప్పటికే గత కొద్ది రోజులుగా భారత్ లో చోటుచేసుకుంటున్న అత్యాచారాలతో దేశవ్యాప్తంగా మహిళలు అందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఇప్పుడు తాజాగా కిడ్నాపింగ్ కేసుల్లో మన దేశం.. ప్రపంచంలోనే రెండో స్థానంలో వుందని నివేదిక వివరాలను బట్టభయలు చేసింది.

ప్రపంచంలోనే అపహరణలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని విదేశీ నివేదిక స్పష్టం చేసింది. ఈ .జాబితాలో మొక్సికో తొలి స్థానంలో నిలిచింది. కాగా, అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఉగ్రవాదులకు స్వర్గధామంలా వున్న పాకిస్థాన్, ఇరాక్, నైజీరియా అప్ఠనిస్తాన్ వంటి దేశాలు కూడా భారత్ కంటే వెనకనున్నాయి. లండన్ నుంచి వెలువడే ఓ కంపెనీ ఈ వివరాలు ప్రకటించింది. పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు.


అయితే భారత్ కంటే పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ సురక్షితమైన ప్రదేశాలని కాదు. ఆ దేశాల కంటే భారత్‌లో కిడ్నాప్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆ దేశాల కంటే భారత్‌లో జనాభా ఎక్కువ కావడం కూడా దీనికి కారణం కావచ్చు. విచిత్రం ఏమిటంటే కిడ్నాప్ పాలసీలు అమ్ముకోవడానికి భారత్‌ను మంచి మార్కెట్‌గా చూడడం మొదలెట్టాయి ప్రపంచ ఇన్సూరెన్స్ సంస్థలు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా నిలిచిన భారత్..లో తప్పడు నివేదికలతో ఇన్సూరెన్స్ సంస్థలకు లాభం చేకూరేలా సదరు నివేదికను తయారు చేశారన్న అరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abductions  kidnap  mexico  india  pakistan  afghanistan  

Other Articles