rishiteswari parents never complained me regarding ragging: principal

No ragging prevails in nagarjuna university says principal

no ragging in nagarjuna university, principal baburao, hostel warden swaroopa rani, guntur district legal cell, rishiteswari sucide case, students in guntur protest dharna, MP kavitha, students protest, cbi probe, Rishiteswari's parents objects probe, four-member committee inquiry, suicide’ of Rishiteswari, holidays, three senior students arrested, Nagarjuna university, retired bureaucrat, retired IAS officer S Balasubramaniam, remand dairy,

No ragging prevails in nagarjuna university says principal baburao talking to media at district legal cell in guntur

ర్యాగింగే లేదని చెప్పిన ప్రిన్సిఫాల్.. ‘రిషితేశ్వరి’ ఆత్మహత్య నిజం కాదా..?

Posted: 08/01/2015 10:04 PM IST
No ragging prevails in nagarjuna university says principal

నాగార్జున వర్సిటీలో బ్యాచిలర్ ఆప్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థిని రుషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ చేపట్టిన జిల్లా లీగల్ సెల్ కు హాజరైయిన ప్రిన్సిపాల్ బాబురావు నాగార్జున యూనివర్శటీలో ర్యాగింగే లేదని, ర్యాగింగ్ జరగలేదని చెప్పారు. ర్యాగింగ్ జరుగుతున్నట్లు కానీ, తమ కూతరు రిషితేశ్వరి ర్యాగింగ్ కు గురైనట్లు గాని అమె తల్లిదండ్రులు తనకు ఎలాంటి ఫిర్యాదుుల చేయలేదని చెప్పారు. అదేవిధంగా తాను మద్యం సేవించి పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఎదుట ప్రిన్సిపాల్ బాబూరావు, హాస్టల్ వార్డెన్ స్వరూప రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు న్యాయమూర్తి తెలుసుకున్నారు. తదిపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేశారు. విచారణ అనంతరం ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ మీడియాతో మాట్లాడారు. హాస్టల్‌లో ర్యాగింగ్ నిరోధానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి తెలిపారు.

విద్యార్థులతో కలసి రేవ్ పార్టీలకు వెళ్లిన తెల్లవారేదాక తందనాలు అడిన ప్రిన్సిపాల్ వీడియో బయటకు రావడంతో అయన అసలు రంగు బయటపడింది. అయినా ఇంకా బుకాయించే ప్రయత్నాలు మానుకోవడం లేదు. ప్రిన్సిపాల్ హోదాలో కొనసాగుతున్న వ్యక్తి విద్యార్థులతో కలసి డాన్సులకు వెళ్లవచ్చా..? అన్న దానిపై ఆయనే సమాధానం చెప్పాలి. యధా రాజా తథా ప్రజ అన్నట్లు.. ప్రిన్సిపాల్ ఎలా వుంటే ఆ కళాశాల విద్యార్థులు కూడా అలానే నడుచుకుంటారన్నది నిజం కాదా..? తమతో డాన్సులు, క్లబులకు తిరిగే ప్రిన్సిపాల్ కు విద్యార్థులు భయపడతారా..? అన్నది సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

కళ్ల ముందు ఇంకా రిషితేశ్వరి బౌతిక కాయం కదలాడుతున్న దృశ్యాలు వీడిపోకముందే.. అదంతా కట్టుకథగా మార్చే ప్రయత్నం సరస్వతమ్మ కొలువైన చోట జరుగుతుంది. అసలు విశ్వవిద్యాలయంలో ర్యాగింగే లేదని చెప్పేవారు.. అందరు శాఖహారులే కానీ మరి రోయ్యల ముళ్లు ఏడపాయే అన్నట్లు.. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందన్న దానికి సమాధానం చెప్పాలి. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు రాసిన మరణవాంగ్మూలం ఆధారంగా ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున దర్నాలు, అందోళనలు చేసి అమెకు న్యాయం జరిగేలా చుస్తున్నాయి.. కానీ  అలా వాంగ్మూలం రాయకపోయి వుంటే తమకు ఇష్టమొచ్చిన కథనాలను అల్లి.. అమె మరణంతో తమకు సంబంధమే లేదని కూడా బుకాయించే వాళ్లు. అలాంటి వారిని కాలేజీ ప్రిన్సిపాల్ గా ఎలా నియమించారన్నది కూడా అక్కడి వారికే తెలియాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rishitheswari  principal baburao  hostel warden swaroopa rani  legal cell  

Other Articles