The History Of Yakub Memon Who Is 1993 Mumbai Bomb Blast Convict | Death Sentences | Supreme Court

History of yakub memon 1993 mumbai bomb blast convict death sentence

yakub memon, yakub memon history, yakub memon biography, yakub memon story, 1993 bomb blast, yakub memon mumbai blast, pakistan mumbai blast, 1993 mumbai bomb blasts, tiger memon, dawood ibrahim

History Of Yakub Memon 1993 Mumbai Bomb Blast Convict Death Sentence : The History Of Yakub Memon Who Is 1993 Mumbai Bomb Blast Convict.

యాకుబ్ ప్రస్థానం: చార్టెర్డ్ అకౌంటెంట్ నుంచి ఉరికంబం వరకు..

Posted: 07/30/2015 10:57 AM IST
History of yakub memon 1993 mumbai bomb blast convict death sentence

1993 సంవత్సరంలో ముంబై నగరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్లు యావత్ ప్రపంచానికి షాక్ ని గురిచేసింది. ఈ మారణహోమంలో 257 మంది ప్రాణాలు కోల్పోగా... 713 మంది క్షతగాత్రులయ్యారు. ఐఎస్ఐ అండతో దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, యాకుబ్ మెమన్ లు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ముఖ్యంగా యాకుబ్ మెమన్ ఈ దాడుల్లో మాస్టర్ మైండ్ గా పేరుగాంచాడు.

యాకుబ్ మెమన్ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే.. 1962 జూలై 30వ తేదీన యాకుబ్ ముంబైలో జన్మించాడు. ఉన్నత విద్యనభ్యసించి 1990లో చార్టెర్డ్ అకౌంటెంట్ పూర్తి చేశాడు. 1991లో తన చిన్ననాటి మిత్రుడు చేతన్ మెహతాతో కలిసి ‘మెహతా అండ్ మెమన్ అసోసియేట్స్’ పేరుతో ఓ చార్టెర్డ్ అకౌంటెన్సీ ఫర్మను స్థాపించాడు. ఏడాది తర్వాత వారిమధ్య ఆర్థికపరంగా విభేదాలు రావడంతో విడిపోయారు. అనంతరం యాకుడ్ తన తండ్రి పేరు మీద ‘ఏఆర్ అండ్ సన్స్’ పేరుతో మరో అకౌంటెన్సీ ఫర్మ నెలకొల్పాడు. ఇలా చార్టెర్డ్ అకౌంటెంట్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయిన యాకుబ్.. ‘బెస్ట్ చార్టెర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ముంబైలోని మెమన్ కమ్యూనిటీ నుంచి అందుకున్నాడు. మరోవైపు.. ‘తేజ్ రాత్ ఇంటర్నేషనల్’ పేరుతో మాంసాన్ని ఎగుమతి చేసే పోర్ట్ కంపెనీని స్థాపించాడు. ఇలా తన కెరీర్ ని సాఫీగా కొనసాగిస్తున్న సమయంలో యాకుబ్ ఉగ్రవాదిగా రూపుదాల్చాడు. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇతడు కూడా పాలుపంచుకున్నాడు.

తన సోదరుడు టైగర్ మెమన్ కి యాకుబ్ ఆర్థిన వనరులు చేకూర్చడంతోపాటు బాంబు దాడులకు సంబంధించి ప్లానింగ్, ఆచరణ వంటి విషయాల్లో దావూద్ కి సహకరించాడని అధికారులు వెల్లడించారు. బాంబు పేలుళ్ల అనంతరం వీరంతా పాకిస్థాన్ వెళ్లిపోయి, అక్కడ వ్యాపారాలు చేశారు. ఒకానొక సందర్భంలో యాకుబ్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు పాక్ లో వ్యాపారం చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని తెలిపాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇతడ్ని పట్టుకున్న విషయంలో రెండు కథనాలు వినిపిస్తుంటాయి. 1994 ఆగస్టు 5న తాము న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో యాకుబ్ ని అరెస్ట్ చేశామని సీబీఐ చెబుతుంటే.. 1994 జూలై 28న తానే నేపాల్ లో సీబీఐకి లొంగిపోయాయని అతడు తెలిపాడు. ఇప్పటికీ ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే వుంది. అటు.. ఈ కేసులో ప్రధాన నిందితులైన దావూద్, టైగర్ లు మాత్రం పాక్ లోనే హాయిగా వున్నారు.

ఇక ముంబై బాంబు పేలుళ్ల కేసును విచారించిన టాడా కోర్టు.. 2007 జూలై 27న యాకుబ్ ని ఉరిశిక్ష విధించింది. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ.. మెమన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని విచారించిన సుప్రీం.. ఈ పేలుళ్ల ఘటనలో యాకుబ్ పాత్ర వుందని నిర్ధారించి, టాడా కోర్టు విధించిన శిక్షను సమర్థించి, 2013 మార్చి 21న సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దాంతో యాకుబ్ మళ్లీ రివ్యూ పిటిషన్ పెట్టుకోగా.. 2013 జూలై 30న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అనంతరం మెమన్ పెట్టుకున్న రిట్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం కొట్టేసింది. తర్వాత మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014 ఏప్రిల్ 11న తిరస్కరించారు. ఉరిశిక్షపై తన వాదనలను ఓపెన్ కోర్టులో వినాలని యాకుబ్ పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన సుప్రీం.. అతని ఉరిశిక్షపై స్టే విధించింది. ఆ సందర్భంలో యాకుబ్ రివ్యూ పిటిషన్ వేసుకోగా.. 2015 ఏప్రిల్ 9న సుప్రీం కొట్టేసింది.

ఇక చివరగా ఈనెల 30వ తేదీన యాకుబ్ ను ఉరితీయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. న్యాయమూర్తి డెత్ వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే మెమన్ మళ్లీ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను ఈనెల 29న సుప్రీం తోసిపుచ్చింది. అలాగే అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను మహారాష్ట్ర గవర్నర్ తోపాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తిరస్కరించారు. తన ఉరిశిక్షను మరో 14 రోజులపాటు నిలిపివేయాలని కోరుతూ యాకుబ్ సుప్రీంని వేడుకున్నప్పటికీ.. ఆ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష తప్పలేదు. ఇలా ఈ విధంగా యాకుబ్ ప్రస్థానం కొనసాగింది. ఇంకో విషయం ఏమిటంటే.. ఇతనికి విధించిన ఉరిశిక్ష రోజు పుట్టిన రోజు కావడం యాదృచ్ఛికం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yakub memon  1993 mumbai bomb blasts  dawood ibrahim  

Other Articles