ISIS | IS | India | US | USA Today

Isis wants to attack india to draw us into war

ISIS, IS, India, US, USA Today, War, Afghanistan, Pakistan, Terror

ISIS wants to attack India to draw US into war A recruitment document purported to have been written by Islamic State (IS) terrorists and obtained by the US media through a Pakistani intermediary outlines a strategy to draw the US into an all-out war by attacking India.

భారత్ మీద ఐఎస్ఐఎస్ దాడికి అంతా సిద్దం...?!

Posted: 07/30/2015 08:55 AM IST
Isis wants to attack india to draw us into war

భారత్ కు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు.. ముప్పు అంటే అంలాంటి ఇలాంటి ముప్పు కాదు. దేశాన్ని సర్వనాశనం చేసి మతరాక్షసత్వానికి కొత్త తెర తీచేలా ఉంది. ఇప్పటికే జమ్ము కాశ్మీర్ లో ఐసిస్ కలకలం రేపుతోంది. కాగా పాకిస్థాన్, ాప్ఘపిస్థాన్ లాంటి దేశాల కారణంగా భారత్ కు ఉగ్రవాద అందునా ముఖ్యంగా ఐసిస్ ముప్పు ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు తేల్చిచెప్పాయి. తాజాగా మరో వార్త కూడా భారత్ కు కలవరం కలిగిస్తోంది. బారత్ మీద ఐసిస్ దండయాత్రకు అంతా సిద్దం చేస్తోందని.. ఎలాగేనా భారత్ లో పాగా వెయ్యడం ద్వారా ఐసిస్ సుస్థితరను, ఉనికి చాటుకోవాలని చూస్తున్నట్లు అమెరికా మీడియా సంస్థ యుఎస్ఎ టుడే వెల్లడించింది.

Also Read :  జమ్ముకాశ్మీర్ లో ఐఎస్ఐఎస్.. పాక్ జెండాలు

భారత్‌పై భారీ స్థాయిలో దాడులు చేసేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌) ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా అంతిమయుద్ధం తరహా దాడులను చేపట్టేందుకు సిద్ధపడుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను అమెరికన్‌ మీడియా సంస్థ యూఎస్‌ఏ టుడే తాజాగా ప్రచురించింది. అంతర్గత ఉగ్రవాద నియామకాలకు సంబంధించిన ఒక డాక్యుమెంటు ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. ఉర్దూలో 32 పేజీలతో ఉన్న ఈ డాక్యుమెంటును పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ తయారు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తానీ తాలిబాన్‌తో సంబంధాలున్న ఒక పాకిస్తానీ పౌరుడి నుంచి ఈ డాక్యుమెంటు లభ్యంకాగా, దీని ఆధారంగా అమెరికా మీడియా సంస్థ ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది.

Also Read :  ఇక కోళ్లే ఆత్మాహుతి దళాలు.. ఐఎస్ఐఎస్

భారత్‌పై అంతిమయుద్ధానికి ఐసిస్‌ సన్నాహాలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. తద్వారా అమెరికాతోనూ ముఖాముఖి తలపడటానికి సిద్ధపడుతున్నట్లు తెలియజేసింది. భారత్‌పై దాడుల నేపథ్యంలో అమెరికా తన అనుచర దేశాలతో తమపై దాడులకు దిగుతుందని ఐసిస్‌ అభిప్రాయపడింది. ఇందుకు పాకిస్తానీ, ఆఫ్ఘన్‌ తాలిబన్లు ఏకంకావాలని కోరుకుంటోంది. ఒకే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా తుది సమరానికి తయారుకావాలని భావిస్తోంది. ఇంతవరకూ కనీవినీ ఎరుగని స్థాయిలో ఇస్లామిక్‌ స్టేట్‌ను విస్తరిస్తామని, ఇందుకు అల్‌ఖైదా కూడా తమతో జత కలవాలని వాంఛిస్తోంది. 100 కోట్ల ముస్లిం జనాభా పరిపాలకుడిగా ఇస్లామిక్‌ స్టేట్‌ నాయకుడినే గుర్తించాలని కోరుతోంది.

- Abhinavachary

Also Read:  ఐఎస్ఐఎస్ టార్గెట్ నరేంద్ర మోదీ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  IS  India  US  USA Today  War  Afghanistan  Pakistan  Terror  

Other Articles