Former President Pratibha Patil wants both car & fuel from government

As nation mourns kalam pratibha patil demands car seva

As nation mourns Kalam, Pratibha Patil demands car seva, Former President Pratibha Patil wants both car & fuel from government, APJ Abdul Kalam, Pratibha Patil, Dr Kalam, New Delhi, Pune, MHA immediate successor at the Rashtrapati Bhavan, Pratibha Patil, government vehicle for personal use, President of India, car and fuel allowence, former president, home ministry

At a time when the whole nation is mourning the passing away of former president APJ Abdul Kalam, his immediate successor at the Rashtrapati Bhavan, Pratibha Patil, is facing criticism for demanding a government vehicle for her personal use.

కారు, ఇంధనం రెండూ ఇవ్వాలన్న ప్రతిభా.. నెట్ జనులు అగ్రహం

Posted: 07/29/2015 10:42 PM IST
As nation mourns kalam pratibha patil demands car seva

యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న దేశస్థులు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణంతో శోకసంద్రంలో మునిగగా.. ఆయన తర్వాత రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రతిభా పాటిల్ మాత్రం దేశ ప్రజల విసుర్లను, వ్యతిరేకతను చవిచూస్తున్నారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన అమెకు ఇది సమయం సందర్భం కాదని తెలియక చేశారో.. లేక ఎలా జరిగిందో తెలియదు కానీ అగ్ని సాధకుడకి యావత్ దేశప్రజలు నివాళులు అర్పిస్తున్న సమయంలో ఆమె మాత్రం నెట్ జనుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇందుకు తన కారు కారణంగా నిలిచింది. అదెలా అంటారా..?

తనకు అధికారికంగా ఓ కారు కేటాయించాలని, దానికి పెట్రోలు బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని, వీటితో పాటు తన ప్రైవేటు వాహనాన్ని కూడా ఉపయోగించుకోడానిక అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అమె కోరారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాజీ రాష్ట్రపతులకు సొంత వాహనం ఉండే దానికి ఇంధన అలవెన్సు మాత్రమే కేంద్ర భరిస్తుంది. అయితే ఒకవేళ సొంత వాహనం లేని పక్షంలో కేంద్రం వారికి ప్రభుత్వ వాహనాన్ని కేటాయిస్తుంది. ప్రస్తుతం ప్రతిభా పాటిల్ కోరుతన్నట్లు చేయాలంటే నిబంధనలను మార్చాల్సి వుంది. పుణేలో ఉన్నప్పుడు తన సోంత కారు వాడుకుంటానని, వేరే ఊళ్లకు వెళ్లాల్సి వున్నప్పుడు ప్రభుత్వ వాహనం వాడతానని అమె కేంద్రానికి సమాచారం పంపినట్లు తెలుస్తోంది.

అయితే ఇలా ఇవ్వడం మాత్రం ప్రస్తుతానికి కుదరదని.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు గత మూడు నెలలుగా అమె కార్యాలయంతో అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అయినా ఫలితం లేకుండా సొంత కారు గానీ, అధికారిక వాహనం గానీ ఎదో ఒకటి నిర్ణయించుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమెకు తెలిపింది. తొలుత తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనం సరిపోదని, అంతేకంటే పెద్ద వాహనం పంపాలంటూ దాన్ని తిప్పి పంపివేయడంతో వివాదం ప్రారంభమైంది. ప్రతిభా పాటిల్ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసే విషయాన్ని పక్కనబెడితే.. ప్రతిభా పాటిల్ పై నెట్ జనులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APJ Abdul Kalam  Pratibha Patil  Dr Kalam  New Delhi  Pune  MHA  car and fuel allowence  

Other Articles