Rishitheshwari | Rishitheshwari suicide | Rishitheshwari death

Balasubrahmanyam committee on rishitheshwari death

Rishitheshwari, Rishitheshwari suicide, Rishitheshwari death, Rishitheshwari, Nagarjuna University, Balasubrahmanyam Committee

Balasubrahmanyam Committee on Rishitheshwari death. AP Govt order to give report on Rishitheshwari suicide at Nagarjuna University college.

ITEMVIDEOS: రిషితేశ్వరి మృతిపై కమిటి ఏం తేలుస్తుందో..?

Posted: 07/29/2015 01:29 PM IST
Balasubrahmanyam committee on rishitheshwari death

రిషితేశ్వరి ఆత్మహత్య మీద దుమారం రేగుతోంది. తోటి విద్యార్థికి జరిగిన అన్యాయం మీద నాగార్జున యూనివర్సిటి అధికారులను నిలదీస్తుంటే... విసి పది రోజుల పాటు యూనివర్సిటికి సెలవులు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అయితే రిషితేశ్వరి వ్యవహారంలో సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైడ్ ఐఎఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటి కొద్దిసేపటి క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చేరుకుంది. రిషితేశ్వరి మరణానికి గల కారణాలు ఏంటి..? ఏ పరిస్థితుల్లో రిషితేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది..? కారణం ఎవరు...? అన్న కోణంలో కమిటి పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది.

Also Read:  మరో రిషితేశ్వరి ఆత్మహత్యను ఆపుదాం

ఏపి ప్రభుత్వం ఆదేశాలలానుసారం రిటైడ్ ఐఎఎస్ బాలసుబ్రహ్మణ్యం కమిటి నాగార్జున యూనివర్సిటికి చేరుకుంది. దాదాపు ఐదు రోజులు యూనివర్సిటిలోనే ఉండి పూర్తి స్థాయి నివేదిక తయారుచేస్తామని బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. నెల్లూరు విక్రమసింహ యూనివర్సిటిని విసి వీరయ్య, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటి ప్రొఫెసర్ బాలకృష్ణమ నాయుడు, తిరుపతి పద్మావతి యూనివర్సిటి రిజిస్ట్రార్ పి. విజయలక్ష్మి లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటి సభ్యులు విసితో పాటు విద్యార్థులను కలిసి ఘటన మీద పూర్తి వివరాలను తెలుసుకోనున్నారు.

Also Read: చీకటి చరిత్రకు రిషితేశ్వరి లెటర్ లో ప్రతి అక్షరం సాక్షమే

రిషితేశ్వరి మృతికి కారణమైనట్లు భావిస్తున్న అనీషా, జయ్ కిరణ్, శ్రీనివాస్ లను ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. ప్రిన్సిపాల్ బాబూరావు మీద తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ప్రిన్సిపాల్ ను సస్పెన్షన్ వేటు వేశారు. అయితే బాబూరావు రిషితేశ్వరి మృతికి కారణం అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి గందగోళంగా మారింది. అయితే ఇప్పటికే యూనివర్సిటిలో చాలా చోట్ల సిసి కెమెరాలను అమర్చిన యూనివర్సిటి సిబ్బంది ఎవరినీ యూనివర్సిటి లోపలికి అనుమతించడం లేదు. విద్యార్థులను ఐడి కార్డులను చూసిన తర్వాత కానీ లోపలికి అనుమతించడం లేదు. నాగార్జున యూనివర్సిటీ మీద వస్తున్న కథనాల ఫలితంగా యూనివర్సిటి పరువుపోతోందని భావిస్తోందని.. అందుకే కనీసం మీడియాను కూడా యూనివర్సిటీ లోనికి అనుమతించడం లేదని సమాచారం.

Also Read:  రిషితేశ్వరిపై ఈ ముగ్గురి మౌనమేల...?

హన్మకొండకు చెందిన  రిషితేశ్వరి అనే విద్యార్థి నాగార్జున యూనివర్సిటి కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మీద, ప్రభుత్వం వైఖరి మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కుల రాజకీయాలకు చంద్రబాబు తలొగ్గుతున్నారని అందుకే రిషితేశ్వరి మృతి మీద ప్రత్యేకంగా విచారణ కోసం బాలసుబ్రహ్మణ్యం కమిటిని నియమించింది. రిషితేశ్వరి మృతి మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి నేడు నాగార్జున యూనివర్సిటి చేరుకున్న కమిటి ఏం రిపోర్ట్ ఇస్తుందో చూడాలి.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles