modi | Nitesh kumar | Bihar | elections | IIT, Narendra Modi

Narendra modi shares stage with nitish kumar

modi, Nitesh kumar, Bihar, elections, IIT, Narendra Modi

PM Narendra Modi shares stage with Nitish Kumar, launches slew of schemes in Bihar. Seeking to kick start the Bharatiya Janata Party (BJP) poll campaign in Bihar, Prime Minister Narendra Modi on Saturday launched a slew of schemes and also flagged off the Indian Railways

ITEMVIDEOS: బద్ద శత్రువులు కలిశారు.. పాట్నా వేదికపై మోదీ, నితీష్

Posted: 07/25/2015 12:54 PM IST
Narendra modi shares stage with nitish kumar

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నది నిజం. ఇదే విషయాన్నిమరోసారి నిరూపిస్తు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్నంత శత్రత్వం ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, భారత ప్రధాని నరేంద్రమోదీ ఒకే వేదికను పంచుకున్నారు. వేదికను పంచుకోవడమే కాకుండా మోదీని నితీష్ కుమార్ పొగడటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అవును ఎందుకు ఇలా జరిగింది అనే అనుమానం కలుగుతుందేమో..? బీహార్ లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. మామూలు టైంలో ఎలా ఉన్నా కానీ ఎన్నికల సమయం కావడంతో మోదీ, నితీష్ ఇలా ఒకే వేదికను పంచుకున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఐఐటి క్యాంపస్ ను ప్రారంభించే కార్యక్రమంలో ఇలా ఇద్దరు నేతలు కలవడం ఎలక్షన్ ల పుణ్యమే అనుకోవాలి.

నేను బిహార్ ప్రభుత్వం తరపున, బీహార్ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాను అని నితీష్ కుమార్ స్వాగతం పలికారు. ఐఐటిని ప్రారంభించిన మోదీ, నితీష కుమార్. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బీహార్ కు వచ్చారు. బీహార్ ప్రజల కోసం తీసుకువస్తున్న పలు పథకాల మీద నితీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అయితే అభివృద్ది కార్యక్రమాల్లో రాజకీయాల ప్రస్తావన సరికాదని ప్రధాని మదోీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందని మోదీ అన్నారు. అభివృద్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు.దేశ రాజధానిలో కూర్చొని పథకాలకు రూపకల్పన చెయ్యడం సరికాదని, రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పథకాలను రూపొందించాల్సిన అవసం ఉందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  Nitesh kumar  Bihar  elections  IIT  Narendra Modi  

Other Articles