Balakrishna | Godavari Pushkaralu | Holi bath

Hindupuram mla balakrishna took holi bath in godavari maha pushkaralu

Balakrishna, Godavari Pushkaralu, Holi bath, Balakrsihna updates, AP, Godavari Pushkar last day

Hindupuram MLA Balakrishna took holi bath in Godavari Maha pushkaralu. Balkrishna took holi bath at Rajahmundry on Pushkar last day.

ITEMVIDEOS: రాజమండ్రిలో పుష్కరస్నానం చేసిన బాలకృష్ణ

Posted: 07/25/2015 03:02 PM IST
Hindupuram mla balakrishna took holi bath in godavari maha pushkaralu

నేటితో ముగియనున్న గోదావరి మహా పుష్కరాలు భక్తులతో కిక్కిరిశాయి. ఏపి ప్రభుత్వం ఎంతో వైభవంగా గోదావరి మహా పుష్కరాల ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేసింది. నేటి ఉదయం హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ రాజమండ్రిలోని కోటిలింగాల విఐపి ఘాట్ వద్ద పుష్కరస్నానం చేశారు. పితృదేవలకు పిండ ప్రదానం చేసి.. తర్వాత పుష్కర స్నానం చేశారు. పుష్కరాలకు విచ్చేసిన బాలకృష్ణతో పాటు పలువురు నేతలు కూడా విచ్చేశారు. పురోహితులు మంత్రోచ్ఛణల మధ్య ఎంతో భక్తి శ్రద్దలతో పితృదేవతలకు బాలకృష్ణ పిండ స్రదానం చేశారు. ముందు నుండి కూడా సనాతన ధర్మాలు అంటే ఎంతో నమ్మకమున్న బాలకృష్ణ చివరి రోజు పుష్కరస్నానం ముగించుకున్నారు.

గోదావరి మహా పుష్కరాలు నేటితో అంగరంగ వైభవంగా ముగియనున్నాయి. ఏపి ప్రభుత్వం చరిత్రలో నిలిచేలా గోదావరి పుష్కరాల ముగింపుకు అన్ని సన్నాహాలు చేసింది. దర్శకుడు బోయపాటి నేతృత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాల ముగింపు ఉత్సవం జరగనుంది. ఇక ప్రత్యేక ఆకర్షణగా బాణా సంచా, లేజర్ షో నిలుస్తాయని అధికారులు అనుకుంటున్నారు. రాత్రి పూట ఎంతో వైభవోపేతంగా పుష్కరాలను అందరికి కనిపించేలా పెద్ద పెద్ ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేస్తోంది ఏపి ప్రభుత్వం. మరోపక్క పుష్కరాల మొదటి రోజు జరిగిన దుర్ఘటన మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగని విధంగా గోదావరి మహా పుష్కరాలను ముగించేందుకు ఏపి ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Godavari Pushkaralu  Holi bath  Balakrsihna updates  AP  Godavari Pushkar last day  

Other Articles