Talasani Srinivas | Telangana | Shabbir ali | Errabelli Dayakar Rao | KCR, Governor

Talasani srinivas questions the congress leader shabbir ali and tdp leader errabelli dayakar rao

Talasani Srinivas, Telangana, Shabbir ali, Errabelli Dayakar Rao, KCR, Governor

Talasani Srinivas questions the congress leader Shabbir ali and tdp leader Errabelli Dayakar rao. TDP Leders met governor on Talasani issue.

షబ్బీర్ అలి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు: తలసాని

Posted: 07/22/2015 08:08 AM IST
Talasani srinivas questions the congress leader shabbir ali and tdp leader errabelli dayakar rao

తాను నైతిక విలువలకు కట్టుబడి ఏనాడో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు. ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై ఆరోపణలు చేసే వారి బండారాన్ని త్వరలో బయటపెడుతానని చెప్పారు. రాజకీయంగా నీచ చరిత్ర ఉన్న టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు తనపై ఆరోపణలు చేసే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు ఒకసారి వాళ్ల చరిత్ర ఏమిటో తెలుసుకోవాలని హితవు పలికారు. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు గండ్ర వెంకటరమణ ఒక ఇసుక దొంగ అని, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ అని తలసాని ధ్వజమెత్తారు. తనపై విమర్శలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్‌అలీకి, టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు లేదని అన్నారు.

Also Read:  ఏం బాబూ.. తలసాని ప్రశ్నకు సమాధానం ఉందా?

తాను మాట్లాడటం మొదలు పెడితే షబ్బీర్‌అలీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో తెలియదని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని 2007మార్చి నెలలో టీఆర్‌ఎస్ అప్పటి స్పీకర్ సురేశ్‌రెడ్డికి పిటిషన్ పెట్టుకుంటే, డిసెంబర్ 2008లో నిర్ణయం ప్రకటించారని గుర్తు చేశారు. ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిందని అన్నారు. వైసీపీకి మద్దతు తెలిపిన 16మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిసెంబర్ 2011లో పిటిషన్ వేయగా మార్చి 2012లో నిర్ణయం వెలువడిందని వివరించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆడిన డ్రామా కాదా? ఆ ప్రభుత్వంలో షబ్బీర్‌అలీ లేరా? అని ఆయన నిలదీశారు.

Also Read:  నేను రాజీనామా చేశాను: తలసాని శ్రీనివాస్

2014లో ఎన్నికలు జరిగిన వెంటనే వైసీపీనుంచి గెలిచిన ఎంపీ ఎస్పీవై రెడ్డిని టీడీపీలో చేర్చుకోలేదా? వైసీపీ ఎంపీలు గీత, రేణుక టీడీపీలో తిరగడం లేదా? కాంగ్రెస్, వైసీపీలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలకు చంద్రబాబు పచ్చ కండువా కప్పలేదా? అని ఆయన ప్రశ్నలవర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తాను సనత్‌నగర్‌నుంచి పోటీ చేయడానికి ఏ సమయంలోనైనా రెడీ ప్రకటించారు. తనపై ఎవరు పోటీలో ఉంటారో తేల్చుకోవాలని సవాల్ విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talasani Srinivas  Telangana  Shabbir ali  Errabelli Dayakar Rao  KCR  Governor  

Other Articles