Talasani Srinivas | Talasani | Resignation | Telangana, Minister, KCR, TDP

Talasani srinivas said that he gave resignation to the speaker

Talasani Srinivas, Talasani, Resignation, Telangana, Minister, KCR, TDP

Talasani Srinivas said that he gave resignation to the speaker. Talasani Srinivas attacks on TDP leaders who complaints about his resignation to the governor.

నేను రాజీనామా చేశాను: తలసాని శ్రీనివాస్

Posted: 07/21/2015 04:37 PM IST
Talasani srinivas said that he gave resignation to the speaker

తెలంగాణలో హాట్ హాట్ గా సాగుతున్న తలసాని వివాదం అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది. రాజీనామా చెయ్యలేదని స్పీకర్ కార్యలయం వెల్లడిస్తే లేదు లేదు.. నేను రాజీనామా చేశాను.. అది స్పీకర్ కు కూడా అందించాను అని తలసాని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తలసాని డ్రామా మీద గవర్నర్ ను కలిసిన కొద్ది సేపటికే తలసాని మీడియా సమావేశాన్ని నిర్వహించడం విశేషం. తాను రాజీనామా చేశానని, స్పీకర్‌ ఆమోదించటమే తరువాయి అని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అంటున్నారు. ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని.. అంటున్నారు.

ఇంకోవైపు.. కావాలనే రాజీనామా డ్రామా ఆడి నైతికవిలువలు వదిలేశారని.. తెదేపా, భాజాపాలు టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేస్తున్నాయి. అయితే, దీనిపై టీఆర్‌ఎస్‌లో ఆసక్తికరమైన చర్చ ఒకటి నడుస్తోంది. ఏ పార్టీకి చెందిన వ్యక్తినైనా.. మంత్రిని చేసే అధికారం సీఎంకు ఉందని... అలాంటప్పుడు తలసాని రాజీనామా ప్రశ్నే ఉత్పన్నం కాదని ప్రచారం జరుగుతోంది. గతంలో దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలు కూడా పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అంతెందుకు మొన్నీమధ్య భాజాపా, శివసేన మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, శివసేనకు చెందిన సురేష్‌ప్రభును రైల్వేమంత్రిగా ప్రధాని నియమించారు. దీనికి ప్రధాని మోడీ ఇటు సొంతపార్టీనిగానీ, శివసేనను గానీ సంప్రదించలేదు. అలాంటప్పుడు రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి,మంత్రిని ఎవ్వరిని నియమించాలో.. వారిష్టం అని ఇది రాజ్యాంగ్యంలోనూ ఉందని చెప్పుకొస్తున్నారు.

ఈ విషయం తెలుసు కాబట్టే.. గవర్నర్‌ కూడా ఏమీ వ్యాఖ్యానించటం లేదని, సీఎం కూడా ఈ వ్యవహారంపై అతిగా స్పందించొద్దని పార్టీ వర్గాలను అంతర్గంతంగా సూచించారట. ఇదండీ సంగతి.. ఈ విషయం మిగతా పార్టీలకు కూడా తెలుసు. కాకపోతే, ఏదో ఒక రచ్చ చేయకపోతే, పబ్లిక్‌లో గుర్తుంచుకోరని చర్చలు, రచ్చలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు సెలవిస్తున్నారు. అయినా ఇంత తెలిస్తే కోర్టుల దాకా ఎందుకు వెళుతుంది అని టిఆర్ఎస్ నాయకులను మరి కొంత మంది ప్రశ్నిస్తున్నారు. అయినా ఇక్కడి దాకా వచ్చాక ఇప్పుడు ఏదో కథలు చెబుతున్నారని.. పలానా దగ్గర అలా జరిగింది అని చెబుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా ఇంతకు ముందే తలసానిని మా ఇష్ట ప్రకారం నియమించుకున్నాం.. మంత్రిని చేశాం అని కేసీఆర్ అండ్ కో చెప్పి ఉండాల్సింది కదా.. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడు గవర్నర్ దగ్గరికి మ్యాటర్ వెళ్లింది కాబట్టి అలాగే అన్ని పార్టీలు దీని మీద సీరియస్ గా దృష్టిసారించిన నేపథ్యంలో తలసాని అంతర్మధనంలో పడ్డట్లు కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talasani Srinivas  Talasani  Resignation  Telangana  Minister  KCR  TDP  

Other Articles