kcr calls global hospital doctors and enquires about prathyusha health condition

Pratyusha is going to start a new life says cm kcr

pratyusha, aware global hospital, KCR couple, CM KCR, Stepmom, Dad Brutally Tortured Pratyusha, high court, uncle, dad, mothers brother, Just for a Flat, aware doctors, pratyusha health bulletin, pratyusha, aware global hospital, heath bulletin, step mother, chamundeshwari, LB nagar police, human rights commision, severe punishment, Girl rescued, Child Rights Group, Child Rights Protection Commission, Child rauma, Torture, pratyusha, aware global hospital, cm kcr, mp kavita

Telangana chief mininster K.Chandrashekar Rao assures to take care of prathyusha, calls global hospital doctors and enquires about her health condition

ప్రత్యూషతో కేసీఆర్ చెప్పెను.. నేనున్నానని.. నీకేం కాదని

Posted: 07/18/2015 06:06 PM IST
Pratyusha is going to start a new life says cm kcr

కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై సరూర్‌నగర్‌లోని గ్లోబల్ అవేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పరామర్శించారు. వీరితో పాటు ఎంపీ కవిత కూడా ఉన్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యూషను పరామర్శించిన సీఎం బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాసేపు బాలికతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రత్యూష తన సవతి తల్లి కలలోకోస్తోందని సీఎంతో తన ఆవేదన చెప్పుకుంది. ఎంతగా మర్చిపోదామని చూస్తున్నా.. తాను అనుభవించిన నరకం తన కళ్లెదుట నుంచి వీడటం లేదని అమె తన గుండెలోతుల్లోని బాధను వారితో పంచుకుంది.

ప్రత్యూష చెప్పనదంతా సావధానంగా విన్న సీఎం.. ‘నేనున్నాను బాధపడకని’ ఆమెకు మనోధైర్యాన్ని ఇచ్చారు. జరిగిందంతా పీడకలగా మరిచిపోవాలని సూచించారు. ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆమెకు సూచించారు..జీవితంలో అందరికీ కష్టాలు వస్తాయి, అప్పుడే వాటిని ధైర్యంగా ఎదుర్కొవాలని తెలిపారు. బాగా చదివి పైకి రావాలని కేసీఆర్ అమెను ప్రోత్సహించారు. నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. నిన్న మంచి హాస్టల్ లో పెట్టి చదవిస్తామని కేసీఆర్ అమెకు హామి ఇచ్చారు. సెలవుల్లో మా ఇంటికి రావాలని ఆయన ప్రత్యూషను ఆహ్వనించారు. ఎవరైనా నీలాంటి పరిస్థితిని ఎదుర్కోంటే వారిని అదుకునే స్థాయికి ఎదగాలన్నారు. ప్రత్యూషకు ఇల్లు కూడా కట్టిఇస్తామని చెప్పారు.

నర్సు కావాలనుకుంటున్నానని ప్రత్యూష అంతకుముందే చెప్పిడంతో ఆ దిశగా ప్రత్యూషకు ప్రభుత్వం నుంచి సహాయం అందనుంది. కావాల్సిన ప్రోత్సాహం, మానసిక కౌన్సెలింగ్‌ అందించనున్నారు.  ప్రత్యూష సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్.. అమె ఆరోగ్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యతను సైబరాబాద్ పోలీసు కమీషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అప్పగించారు.  ప్రత్యూషను కష్టాలు పెట్టిన సవతి తల్లి, తండ్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pratyusha  aware global hospital  cm kcr  mp kavita  

Other Articles