Cow’s heart valve to an old woman | heart transplant | old woman

Cow s heart valve to old woman

Cow’s heart valve to old woman, Cow heart to woman, cow heart valve to woman, heart transplant, Frontier Lifeline Hospital,

An 81 year old woman of Hyderabad, who was suffering from a heart disease, was operated using a heart valve made from a cow's heart.

వినూత్న శస్త్రచికిత్స.. వృద్దురాలికి అవుగుండెతో ప్రాణం పోసిన వైద్యులు

Posted: 07/16/2015 03:38 PM IST
Cow s heart valve to old woman

హృద్రోగులకు శుభవార్తనందించారు తమిళనాడు రాజధానికి చెందిన చెన్నై వైద్యులు. చెన్నైలోని ఫ్రంటియర్ లైఫ్ లైన్ ఆస్పత్రి వైద్యులు దైశంలోనే తొలిసారిగా వినూత్న శస్త్రచికిత్స చేసి విజయవంతమయ్యారు. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవు గుండె నుంచి తీసని వాల్వ్ ను అమర్చి ఆమెను ప్రాణాలు పోశారు వాల్వ్ ఇన్ వాల్వ్ ట్రాన్ స్కాథెటర్ ఎరోటిక్ వాల్వా (వీఐవీ-టీఎవీఆర్) అనే విధానంలో ఈ శస్త్రచికిత్సను చేసినట్లు అస్పత్రి వ్యవస్థాపకులు డాక్డర్ చెరియన్ తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన అల్లూరి సీతాయమ్మ అనే 81 ఏళ్ల వృద్ధురాలికి పదకొండేళ్ల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్‌ను అమర్చారు. అయితే కొంతకాలం ఆరోగ్యంగానే తిరిగిన ఆమెకు.. ఎనిమిది నెలల నుంచి మళ్లీ గుండెలో నొప్పి రావడం ప్రారంభించింది. దీంతో చికిత్స కోసం దేశమంతా తిరిగిన ఆమెకు ఎక్కడా సరైన వైద్యం లభించలేదు. చివరగా చెన్నైలోని ఫ్రంటియర్ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ ఆమెకు ఆవు గుండె నుంచి తీసి తయారు చేసిన వాల్వ్ ను అమర్చి అపరేషన్ చేసేందుకు వైద్యులు ముందుకోచ్చారు. ఆ విధంగా ఇవాళ శస్త్రచికిత్స చేసి అమెకు బ్రతికించారు.

కాగా, ఈ ఆపరేషన్ పై ఫ్రంటియర్ ఆసుపత్రి వైద్యుడొకరు మాట్టాడుతూ.. ‘సంప్రదాయ శస్త్రచికిత్సకు ఇది భిన్నమైంది. ఆమె గుండె వాల్వ్‌ పూర్తిగా దెబ్బతింది. ఈ శస్త్రచికత్స కూడా చాలా ప్రమాదంతో కూడుకున్నదని చెప్పారు. 81 వృద్దురాలి పరిస్థితిని అధ్యయనం చేసిన తరువాత అమెకు శస్త్రచికిత్స చేశామని చెప్పారు. ఏది ఎలావున్నా ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించగలిగామని వెల్లడించారు. ప్రస్తుతం సీతాయమ్మ ఆరోగ్యంగా వున్నారని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cow  Frontier Lifeline Hospital  woman  

Other Articles