Godavari pushkaralu | Rajamandry | chandrababu, KCR, Modi

Death toll rising in the incident at rajahmundry godavari pushkaralu

Godavari pushkaralu, Rajamandry, chandrababu, KCR, Modi

Death toll riseing in the incident at Rajamandry Godavari Pushkaralu. Modi, KCR and some more leaders respond on the incident.

ITEMVIDEOS: పెరుగుతున్న మృతుల సంఖ్య.. గోదావరి పుష్కరాల్లో మహా విషాదం

Posted: 07/14/2015 12:57 PM IST
Death toll rising in the incident at rajahmundry godavari pushkaralu

మహా విషాదం.. పుణ్యం కోసం అంటూ వచ్చిన భక్తులలో కొంత మంది తొక్కిసలాటలో దాదాపు 27 మంది మృతి చందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మృతుల సంఖ్యఅంతకంతకు పెరుగుతోంది. రాజమండ్రిలో మొదటి రోజు పుష్కారాల సందర్భంగా ఒక్కసారిగా భక్తులు భారీగా తరలిరావడంతో పరిస్థితి గందరగోళం చోటుచేసుకుంది. అయితే మొదటి రోజు పుణ్యస్నానాలు చేస్తేనే పుణ్య వస్తుంది అని చాలా మంది భక్తులు నమ్ముతుండటంతో ఇబ్బందులు తెలెత్తుతున్నాయి. రాజమండ్రిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. రా.మండ్రిలోని కోటగుమ్మ్ం పుష్కరఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల మీద ఏపి చంద్రబాబు నాయడు, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు బాధ్యత వహించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తన్నారు. వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కానీ చివరకు విఫలం కావడం శోచనీయచం  అని వారు అంటున్నారు.

రాజమండ్రి పుష్కరాలలో చోటుచేసకున్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పుష్కరస్నానం కోసం వచ్చిన భక్తులు దురదృష్టవశాత్తు మరణించడంపై మోదీ సంతాపం వ్యక్తం చే:శారు. పరిస్థితిని త్వరితగతిన చక్కదిద్దాలని మోదీ చంద్రబాబు నాయుడుకు సూచించారు. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఘటనపై సంతాపం ప్రకటించారు. ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలయజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేసీఆర్ కోరుకున్నారు. ఎలాంటి ఆటంకాలు జరకుండాపుష్కరాలు కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భక్తులు కూడా సయమనంతో పుష్కర స్నానాలు ఆచరించాలని సూచించారు.

pushkar-death-in

* రాజమండ్రిలో30కిమీ ట్రాఫిక్ జామ్
*ఈ ఒక్క రోజే దాదాపు 10 లక్షల మంది వచ్చే అవకాశం
*ఉదయం 3 లక్షల మంది వస్తేనే భారీగా మృత్యువాత పడిన భక్తులు.. ఆందోళనలో భక్తులు.. ఏంజరుగుతుందోనన్న టెన్షన్ లో పోలీసులు, అధికారులు
*ఘటనపై చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి
*చంద్రబాబు నాయుడు కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
*ఒకే సమయంలో రెండు లక్షల మంది స్నానాలు చేస్తున్న భక్తులు
*రాజమండ్రిలో మొత్తం 17 ఘాట్ లు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు స్నానం చేసిన పుష్కర ఘాట్ వద్దకు ఎక్కువ మందికి చేరుకోవడంతో ఇబ్బంది తలెత్తింది. దాంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
*తొలిరోజు పుష్కర స్నానం  చేస్తేనే పుణ్యం వస్తుందనేది కేవలం అపోహ: స్వరూపానందం
*రాజమండ్రి చుట్టు పక్కలి నుండి 108 వాహనాలను తరప్పిస్తున్న అధికారులు
*ప్రస్తుతం పుష్కర ఘాట్ ల వద్ద మూడు అంబులెన్స్ లు అందుబాటులో ఉంచిన అధికార యంత్రాంగం

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari pushkaralu  Rajamandry  chandrababu  KCR  Modi  

Other Articles