chaitanyapuri engineering sisters killed in psycho attack

Psycho murdered sisters in chaitanyapuri

chaitanyapuri engineering sisters killed in psycho attack, psycho murdered sisters in chaitanyapuri, violence against women, crime against women, harrassment against women, chevella sagar engineering collage, police complaint on eve teasing, police failure in sisters attack, final year engineering students, gitam engineering collage, psycho, chaitanyapuri, attack, i died, Sri lekha, yamini saraswathi, Amit singh, onw side lovers

Amit singh a one side lover attacked his lover Sri lekha, and her elder sister yamini saraswathi at their house for not accepting his love.

ప్రేమోన్మాది ఘాతుకం.. అక్కా చెల్లెళ్ళపై దాడి.. ఇద్దరు మృతి

Posted: 07/14/2015 02:06 PM IST
Psycho murdered sisters in chaitanyapuri

మగ ‘మృగాళ్ల’ ప్రేమ దాహానికి అభం శుభం తెలియని అమాయక అక్కాచెల్లెళ్ళi బలైపోయారు. హైదరాబాద్‌ నగరంలో పట్టపగలు ప్రమోన్మాది భీభత్సం సృష్టించినా వాడిని ధీటుగా ఎదుర్కోన్న అమాయక అక్కాచెల్లెళ్ళ అసువులు బాసారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురి కాలనీలోని కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో ఇవాళ ఉదయం ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించకుండా మౌనంగా వుంటూ కాలయాపన చేస్తుందన్న అక్కస్సులో అక్కాచెలెళ్లపై విచక్షణా రహితంగా కత్తితో దాడికి వడిగట్టాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా వారిపై దాడి చేశాడు. అనూహ్యంగా జరిగిన ప్రమోన్మాది దాడి ఘటనతో ఒక్కసారిగా నిశ్చేష్టులైన కాలనీ ప్రజలు తేరుకునే లోను  ఆ ప్రేమోన్మాది అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలైన అక్కాచెలెళ్లులను స్థానికులు ఆస్పత్రికి తరలించాగా వారిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు.

వివరాలలోకి వెళితే... మహాబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చెందిన కృష్ణారెడ్డి, హైమావతి దంపతులకు యామిని సరస్వతి, శ్రీలేఖ అను ఇద్దరు అమ్మాయిలే సంతానం, వారిద్దరూ వారి పంచప్రాణాలు. చైతన్యపురి పీఎస్ పరిధిలోని మోహన్ నగర్ లో వీరు నివాసముంటున్నారు. యామిని గీతం కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేయగా, శ్రీలేఖ చేవళ్లలోని సాగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చివరి సంవత్సరం చదువుతుంది. అదే కాలేజీకి చెందిన అమిత్‌సింగ్ అనే యువకుడు శ్రీలేఖను ప్రేమించాలంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు.

అయితే కొంతకాలనికి అమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు అతనిపై గతంలోనే పోలీసులకు పిర్యాదు చేశారు. అయినా ఏ మాత్రం మార్పు రాని అమిత్ సింగ్ తన ప్రేమను అంగీకరించమని మళ్లీ శ్రీలేఖ వెంటపడుతూనే వున్నాడు. అయినా శ్రీలేఖ ఏ సమాధానం చెప్పకుండా మౌనంగానే వుండిపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 గంటలకు ఆమిత్ సింగ్ నేరుగా శ్రీలేఖ ఇంటికే వెళ్లి ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో అమెపై దాడి చేశాడు. అడ్డొచ్చిన ఆమె సోదరి యామినిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో ఆ అక్కచెల్లెల్లిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడి కోసం గాలిస్తున్నామని,  వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : psycho  chaitanyapuri  attack  sisters died  Sri lekha  yamini saraswathi  

Other Articles