Pawan Kalyan Latest Tweets On Congress Party Raises New Doubts | Ap Special status | Chiranjeevi

Pawan kalyan congress tweets raises doubts ap special status chiranjeevi

pawan kalyan, pawan kalyan twitter, congress party, ap special status, chiranjeevi news, chiranjeevi, pawan tweets chiranjeevi, bjp party, ap state controversies, ap latest updates, ap special status updates, pawan kalyan controversy, pawan kalyan latest tweets

Pawan Kalyan Congress tweets Raises Doubts Ap Special status Chiranjeevi : Janasena President Pawan Kalyan Latest Tweets On Congress Party Raises New Doubts.

పవన్ ట్వీట్లపై ‘చిరు’ అనుమానాలు..?

Posted: 07/13/2015 05:22 PM IST
Pawan kalyan congress tweets raises doubts ap special status chiranjeevi

జనసేనాధిపతి పవన్ కల్యాన్ తాజాగా కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే! 5 కోట్ల ఆంధ్రుల ప్రధాన సమస్య అయిన ‘ప్రత్యేక హోదా’ విషయాన్ని విస్మరించి, లలిత్ మోదీ వ్యవహారాన్ని ప్రధాన అంశంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తోందని ఆయన ఘాటుగా కామెట్లు చేశారు. అయితే.. ఈ ట్వీట్లను కాస్త పరిశీలిస్తే మాత్రం వాటిల్లో ‘చిరు’ అనుమానాలు వెలువడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ అనుమానాలు ఏంటి? అని అనుకుంటున్నారా..? ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే...

పవన్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించడం బాగానే వుంది కానీ.. ఇండైరెక్టుగా ఆయన బీజేపీ తరఫున గళం విప్పుతున్నారా? అనేది మొదటి సందేహంగా వినిపిస్తోంది. మరో సందేహం ఏమిటంటే.. ప్రస్తుతం ఎంపీగా, ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేత అయిన చిరంజీవి ఈ విషయంలో ఇండైరెక్టుగా ప్రశ్నించారా? అని చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆయన డైరెక్టుగా చిరంజీవినే ప్రశ్నించకుండా ఆ పార్టీని ఎందుకు ప్రశ్నించారు? అలా ప్రశ్నించడం వల్ల లాభమేంటి? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ‘ప్రత్యేక హోదా’ని మర్చిపోయిందని కాంగ్రెస్ నేతల్ని నిలదీసిన పవన్.. ఆ పార్టీలోనే వున్న తన అన్నను ప్రశ్నించకపోవడం విడ్డూరంగా వుందని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఇకపోతే.. అవినీతిపై ప్రశ్నిస్తానని గళమెత్తిన పవన్.. తన ట్వీట్లలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి లలిత్ మోడీ కేసుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదన్నట్లుగా మాట్లాడారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఆయన ఓటుకునోటు వ్యవహారంపై పెదవి విప్పలేదు కాబట్టి.. పవన్ అవినీతిని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ అనుమానాల విషయం పక్కనపెడితే.. ‘ప్రత్యక హోదా’పై అందరిలోనూ చురుకు పుట్టించడం మంచిదేనని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Chiranjeevi  AP Special Status  Congress Party  

Other Articles