cyberabad police finally arrests housewife bihari kidnapper in kolkata | crime news

Cyberabad police finally arrests housewife bihari kidnapper in kolkata

cyberabad police, bihar kidnapper, housewife kidnap, hyderabad housewife kidnap, bihari kidnapped hyderabad housewife, man kidnapped friends wife, wife kidnapped by friend

cyberabad police finally arrests housewife bihari kidnapper in kolkata : Finally cyberabad police finally caught bihari kidnapper who kidnaped a housewife in hyderabad.

ఆ ‘వివాహిత’ కిడ్నాపర్ ఖేల్ ఖతమ్..

Posted: 07/13/2015 11:08 AM IST
Cyberabad police finally arrests housewife bihari kidnapper in kolkata

హైదరాబాదులోని రాజేంద్రనగర్ కు చెందిన ఓ వివాహిత ఇటీవలే కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే! సంచలనం సృష్టించిన ఈ కిడ్నాప్ కేసును సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మూడురోజుల క్రితం ఆ వివాహితను అపహరించిన అతగాడు.. ఆమెను ఒడిశా మీదుగా కోల్ కతాకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి రూ.3 లక్షల రూపాయలు కావాలంటూ ఆమె భర్తకు డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలి భర్త సైబరాబాదు పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి.. చివరికి అతడిని పట్టుకోగలిగారు. ఆ కిడ్నాపర్ బీహారీ అని కనుగొన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని రాజేంద్రనగర్ కు చెందిన ఓ వివాహితను బీహార్ కు చెందిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆమెను ఒడిశా మీదుగా కోల్ కతా తరలించాడు. అక్కడికి వెళ్లిన అనంతరం ఆమెను విడిచిపెట్టాల్సంటే రూ.3 లక్షలు ఇవ్వాలంటూ బాధితురాలి భర్తకు వాట్సాప్ ద్వారా డిమాండ్ చేశాడు. అంతేకాదు.. ఆమెను కొట్టిన దృశ్యాల్ని సైతం భర్తకు సోషల్ మాధ్యమం ద్వారా పంపించాడు. మూడు లక్షలు ఇవ్వకుండా ఆమెను ముంబైలోని ‘రెడ్ లైట్’ ఏరియాలో అమ్మేస్తానని.. అలా అమ్మేస్తే తనకు రూ.3 లక్షలు వస్తాయని వాట్సాప్ లో పేర్కొన్నాడు కూడా! మొదట బాధితురాలి భర్త రూ.లక్ష ఇచ్చాడు. కానీ.. తనకు మరిన్ని డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ బాధితురాలి భర్త సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.

బాధితురాలి భర్త నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో అతగాడు పశ్చమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో వున్నట్లు వారు గుర్తించారు. పక్కాసమాచరంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. చాకచక్యంగా అతడిని పట్టుకుని, అతని చెర నుంచి బాధితురాలిని విముక్తి కల్పించారు. పోలీసుల విచారణలో తేలిన ఇంకొక విషయం ఏమిటంటే.. బాధితురాలికి ఆ కిడ్నాపర్ పరిచయస్తుడేనని తేలింది. ఈ కిడ్నాప్ చేయడం వెనుక అసలు కథేంటో పోలీసులు ఆ బీహారిని ప్రశ్నించగా.. తాను కేవలం డబ్బుల కోసం మాత్రమే సదరు వివాహితను కిడ్నాప్ చేసినట్లుగా ఆ బీహారు పేర్కొన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyberabad police  bihar kidnapper  housewife kidnapped  

Other Articles