AP Chief Minister | Harish Rao | Chandrababu | ap, irrigation projects, palamur lift irrigation

Telangana irrigation minister harish rao fire on chandrababu for ap illigal projects

AP Chief Minister ,Harish Rao, Chandrababu, ap, irrigation projects, palamur lift irrigation

telangana irrigation minister Harish Rao fire on chandrababu for ap illigal projects. He questions the ap irrigation projects in ap

చంద్రబాబూ.. నీ దొంగ ప్రాజెక్టుల సంగతి ఏంటి..?

Posted: 07/12/2015 11:21 AM IST
Telangana irrigation minister harish rao fire on chandrababu for ap illigal projects

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విరుచుకుపడ్డారు.పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశారని అన్నారు. 2013లోనే రోజుకు రెండు టీఎంసీల చొప్పున 35 రోజులపాటు 70 టీఎంసీలు తీసుకోవచ్చంటూ డీపీఆర్ కోసం ఉమ్మడి ప్రభుత్వం ఈ పథకానికి జీవో ఇస్తే, దానిని చంద్రబాబు కొత్త ప్రాజెక్టు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏపీలో హంద్రీనీవా, గాలేరు నగరి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా? నిలదీశారు. ఒకవేళ అనుమతులు లేని ఆ ప్రాజెక్టులకు నీళ్లు నిలిపివేస్తే తాము కూడా ఆలోచిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

అందుకు సిద్ధమేనా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇంజినీరింగ్ రంగ నిపుణుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్‌వాసులకు తాగునీళ్లు ఇచ్చేందుకు చంద్రబాబు అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు 299 టీఎంసీల నీటిని కేటాయించిందని, ఇంకా వాటా కోసం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌పై తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఆగస్టులోపు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఏ అనుమతులతో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి కేటాయింపులు కేవలం రాష్ర్టాలకు సంబంధించిన విషయమని, ఏ ప్రాంతానికి, ఏ ప్రాజెక్టుకు నీటిని కేటాయిస్తారనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని గతంలోనే కేంద్రం, సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఇంజినీర్లు: తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ వెన్నుదన్నుగా నిలిచిందని, నిధులు, నీళ్లు, నియామకాల్లో జరిగిన అన్యాయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించిందని హరీశ్‌రావు కొనియాడారు. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు మారుమూల ప్రజలకు సైతం నీళ్లలో ఎలా అన్యాయం జరుగుతుందో వివరించి ప్రజల్లో చైతన్యం తెచ్చారని అభినందించారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు, రోడ్లు, చెరువుల పనులు ఇచ్చారని అన్నారు. ఇంజినీర్ల జేఏసీ విజ్ఞాపన మేరకు భవన నిర్మాణానికి రెండువేల గజాల స్థలం, ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సమకూరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా నవాబ్ అలీ నవాజ్ జంగ్ పేరును ఒక భవనానికి పెడితే బాగుంటుందని, న్యాక్, జలసౌధలో దేనికి పెడితే బాగుంటుందనేది సీఎంతో సంప్రదించిన తర్వాత నిర్ణయిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Chief Minister  Harish Rao  Chandrababu  ap  irrigation projects  palamur lift irrigation  

Other Articles