janasena activists declare war against TDP MPs

Janasena activists state wide protest over tdp mps comments

janasena activists state wide protest over TDP MPs comments, pavan kalyan on cash for vote case, section 8, special status, TDP mps, hyderabad, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

janasena activists stage state wide protest over TDP MPs comments

టీడీపీ ఎంపీల వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా జనసేన ధర్నా

Posted: 07/08/2015 01:51 PM IST
Janasena activists state wide protest over tdp mps comments

తెలుగు దేశం పార్టీ ఎంపీలపై జనసేన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం మీడియా సమావేశంలో తన అభిప్రాయాలను వెలువరించిన అనంతరు ఆంధ్రప్రదేశ్ లోని పలువురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు పవన్ కల్యాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు పెళ్లుబిక్కుతున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నర్సాపురం, తదితర ప్రాంతాల్లో జనసేన పార్టీ శ్రేణలు, కార్యకర్తలు టీడీపీ ఎంపీలు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు.

టీడీపి ఎంపీలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. తమ అధినేతపై పోలిస్ స్టేషన్ లో కేసులు పెడతానన్న టీడీపీ ఎంపీలకు నిజంగా ధైర్యముంటే కేసులు పెట్టాలని సవాల్ విసురతున్నారు. పవన్ కల్యాన్ ప్రచారంతోనే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సత్యాన్ని పార్టీ అధినేత చంద్రబాబు గుర్తించి.. పవన్ పై ప్రతి విమర్శలకు పాల్పడవద్దని సూచించినా.. ఎంపీలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంపై పార్టీ శ్రేణలు మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఎలా అడుగుపెట్టారన్న విషయాన్ని మర్చిపోరాదని వారు సూచించారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యాలకు పాల్పడితే.. పరిణామాలు తీవ్రంగా వుంటాయిన జనసేన పార్టీ శ్రేణులు హెచ్చరించారు.

టీడీపీ, బిజేపిలు ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించేందుకు తమకు ఓటయమని చెప్పింది నిజం కాదా..? అని వారు ప్రశ్నించారు. ఏడాదినర్న కాలం కావస్తున్నా.. వారు చెప్పిన హామినీ నిలబెట్టుకోకుండా.. తమ అధినేతపై విరుచుకుపడతారా అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలకు నిజంగా చిత్తశుద్ది వుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన విషయమై తమ పార్టీ మహానాడు కార్యక్రమంలో తీర్మాణాన్ని ఎందుకు ప్రవేశపెట్టించలేకపోయారని జనసేన నేతలు నిలదీస్తున్నారు.

పక్క రాష్ట్రం వారు పార్టీలకు అతీతంగా ఉద్యమించి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించారని, అదే స్పూర్తితో మన ఎంపీలు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి.. మహోద్యమంగా మార్చాలని, అందుకు ఎంపీలు తమ వ్యాపారాలను పక్కన బెట్టాలని పవన్ కల్యాన్ సూచించడంతో తప్పేముందని జనసేన పార్టీ నేతలు టీడీపీ ఎంపీలను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలను, రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో ఎంపీలు విఫలమయ్యారని పవన్ అనడంతో తప్పేముందని వారు నిలదీస్తున్నారు. టీడీపీ ఎంపీలు రమారమి వ్యాపారస్థులు కావడంతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడం లేదని జనసేన పార్టీ నేతలు దుయ్యబడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  twitter  AP TDP MPs  parliament members  

Other Articles