Every death in Vyapam scam will be investigated, Shivraj Singh Chauhan says

Doctor connected to vyapam probe found dead in delhi hotel

Doctor connected to Vyapam probe found dead in Delhi hotel, Dr Arun Sharma,Vyapam scam,MPPEB scam,MPPEB,Dean Arun Sharma,Jabalpur medical college,NS medical college, Delhi journalist death, Aaj Tak journalist, Vyapam scam, Rahul Gandhi, Arvind Kejriwal, cremation

Madhya Pradesh chief minister Shivraj Singh Chouhan on Sunday said that every death related to Vyapam scam will be be investigated.

వ్యాపమ్ స్కాంలో కలకలం రేపుతున్న వరుస అనుమానాస్పద మరణాలు..

Posted: 07/05/2015 06:42 PM IST
Doctor connected to vyapam probe found dead in delhi hotel

ఓ కుంభకోణ పర్వం వెలుగులోకి రావడం.. ఆ తరువాత జరుగుతున్న పరిణామాలు యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఈ కుంభకోణంతో పత్యక్షంగా, పరోక్షంగా వున్న సంబంధమున్న వాళ్లు ఒక్కొక్కరుగా వరుసగా మృత్యువాత పడుతుండటం దేశంలో సంచలనంగా మారుతోంది. మధ్యప్రదేశ్‌లో వృత్తిపరీక్షల బోర్డు(వ్యాపమ్) కుంభకోణంలో ఏకంగా 42 మంది మరణించారు.
 
నిన్న ఈ కేసులో నిందితురాలి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు అక్షయ్ సింగ్ అనుమాన్సదంగా మరిణించగా, తాజాగా జబల్‌పూర్‌ మెడికల్‌ కాలేజీ డీన్‌ మృతిచెందారు. ఢిల్లీలోని ఉప్పల్‌ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ఈ స్కామ్‌ను విచారిస్తున్న కమిటీలో సభ్యుడు. ఈ స్కామ్‌ను విచారిస్తున్న స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌కు శర్మ సమాచారం అందిస్తున్నాడని తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఈ స్కామ్‌లో నిందితులు, సాక్షులు అయినవారిలో దాదాపు 47 మంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది.

మధ్యప్రదేశ్‌లో టీవీ టుడే టీవీ చానల్ రిపోర్టర్‌ అక్షయ్ సింగ్ ఆకస్మికంగా మృతి చెందారు. స్కాం నిందితురాలు నమ్రతా దామోర్ తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ చేసేందుకు  అక్షయ్ సింగ్‌ మధ్యప్రదేశ్‌ వెళ్లారు. అక్షయ్ ఆ ఇంటిలో ఉండగానే హఠాత్తుగా నోట్లోంచి నురగలు వచ్చాయి. ఆయనను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లిన అప్పటికే అక్షయ్‌ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బిజెపి నేతృత్వంలో ఈ స్కామ్‌ జరిగింది. 2009లో ప్రభుత్వ నియామకాల్లో 300 మంది అన్హరత కలిగిన ఉద్యోగులను నియమించారు. 2013లో ఈ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌లో బడా రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ అంశమై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసును సీబీఐకి అనుమతించేది లేదని అన్నారు. అయితే తమ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఈ కుంభకోణంలో మరణించిన ప్రతీ ఒక్కరి మరణాన్ని విచారణ జరపిస్తామన్నారు. జర్నలిస్టు అక్షయ్ సింగ్ అనుమానాస్పద మరణాన్ని సిట్ కు అప్పగిస్తామని కూడా హామి ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రే కావాలని ఈ కేసులో దోషులను రక్షిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. కాగా, ఇందులో ఎక్కువ మంది అధికారపార్టీ నాయకులు, వ్యాపారులు, రిక్రూట్‌మెంట్‌ మాఫియా, దళారులు ఉన్నారని అనుమానాలు రేకెత్తుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vypam scam  deen died  42 persons died  mystery behind scam  

Other Articles